బిజినెస్

ఆర్థిక క్రమశిక్షణకు చిరునామా కేంద్ర బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశాభివృద్ధికి చక్కటి ఆర్థిక ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించిందని మంగళవారం సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ శకుంతల అన్నారు. గత బడ్జెట్‌లకు తాజా బడ్జెట్‌కు ఎంతో వ్యత్యాసం ఉందన్న ఆమె ఆర్థిక క్రమశిక్షణకు బాటలు వేసేలా 2016-17 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారన్నారు. అభివృద్ధి, ఉద్యోగావకాశాలకు ఉత్తమ విధి విధానాలు ఖరారు చేశారన్నారు. చిన్న మొత్తంలో పన్ను లు చెల్లించే వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయ పన్నులో సంస్కరణలు తెచ్చారన్నారు. సిఐఐ తెలంగాణ చైర్‌పర్సన్ దాట్ల వనిత మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ సమతుల్యతతో ఉందని, వౌలిక సదుపాయాలు, గ్రామీణ ఆర్థిక రంగానికి బాటలు వేశారన్నారు. ఇక్కడ కేంద్ర బడ్జెట్‌పై సిఐఐ, ఫ్యాప్సీ నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ కేంద్రం తొమ్మిది ఆర్థిక స్తంభాలపై దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు ఖరారు చేసిన ప్రణాళిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. సిఐఐ చేసిన అనేక సిఫార్సులను కేంద్రం పరిగణనలోకి తీసుకుందన్నారు. ఆదాయం పన్ను విధానాల్లో సంస్కరణలు తేవడాన్ని ఆమె స్వాగతించారు.
ఇన్‌క్యాప్ ఎండిగా
ఐఎఫ్‌ఎస్ అధికారి సుమన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 1 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వౌలిక సదుపాయాల కార్పొరేషన్ (ఇన్‌క్యాప్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారి ఆర్‌కె సుమన్‌ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇన్‌క్యాప్ ఎండి బాధ్యతలతోపాటు ఎపి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటి సిఇఓగా కూడా అదనపు బాధ్యతల్లో సుమన్ కొనసాగుతారని ప్రభుత్వం ప్రకటించింది.