బిజినెస్

నాలుగు రోజుల్లో రూ. 4 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి గత వారం విదేశీ పెట్టుబడులు పోటెత్తాయ. అంతకు ముందు పెట్టుబడుల ఉపసంహ రణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గత వారం మాత్రం షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. కేవలం నాలుగు రోజుల్లో 4,100 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడు లను పట్టుకొచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్ల కోతలపై అంచనాలు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్లు ఎఫ్‌పిఐలను విపరీతంగా ఆకట్టుకున్నాయ. నిజానికి జనవరి, ఫిబ్రవరి నెలల్లో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకున్నారు. అయతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17) గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో గత వారం ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్ అనంతరం పరిస్థితులు మారిపోయాయ.
ద్రవ్యలోటును జిడిపిలో 3.5 శాతానికే కట్టడి చేస్తామన్న జైట్లీ వ్యాఖ్యలు స్వదేశీ మదుపరుల తోపాటు విదేశీ మదుపరులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయ. ఈ క్రమంలోనే పెట్టుబడులు భారీగా తరలిరాగా, డిపాజిటరీలు అందించిన సమాచారం మేరకు ఈ నెల 1-4 మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎఫ్‌పిఐలు 4,129 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. అయతే రుణ మార్కెట్ల నుంచి 747 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకుపోయారు. అయనప్పటికీ మార్చి నెలలో నికర విదేశీ పెట్టుబడుల విలువ 3,382 కోట్ల రూపాయలుగా నమోదైంది.
కాగా, గత నెల జనవరిలో ఎఫ్‌పిఐలు.. స్టాక్ మార్కెట్ల నుంచి 11,126 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకోగా, రుణ మార్కెట్లలోకి మాత్రం 3,274 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఫిబ్రవరిలో కూడా స్టాక్ మార్కెట్ల నుంచి 5,521 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పతనమవడం, ప్రపంచ ఆర్థిక ప్రతికూల పరిస్థితులు, ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం విదేశీ మదు పరులను పెట్టుబడులకు దూరం చేశాయ. బ్లూచిప్ సంస్థల ఆర్థిక ఫలితాలు నిరాశ కలిగించడం, ప్రధానంగా బ్యాంకింగ్ సంస్థల నష్టాలూ దేశీయ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయ.
ఇదిలావుంటే భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులు గత ఏడాది (2015) కూడా భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు)గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది. మొత్తం స్టాక్, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 63,662 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది 2014లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువే దాదాపు లక్ష కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. 2012, 2013 సంవత్సరాల్లోనూ లక్ష కోట్ల రూపాయల చొప్పున విదేశీ పెట్టుబడులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక రుణ మార్కెట్లలోకి 2014లో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.6 లక్షల కోట్ల రూపాయలు (26 బిలియన్ డాలర్లు)గా ఉంది. 2014లో మొత్తం రెండున్నర లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి తరలివచ్చాయ. అయ తే 2013లో రుణ మార్కెట్ల నుంచి 51,000 కోట్ల రూపాయల (8 బిలియన్ డాల ర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ 2012లో 35,000 కోట్ల రూపాయలు, 2011లో 42,000 కోట్ల రూపాయలు, 2010లో 46,408 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు.