బిజినెస్

చేతివృత్తులకు ఊతమివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఆధునిక ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనే విధంగా దేశంలో చేతివృత్తుల రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. రుణ సదుపాయాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, ఉత్పత్తులను ప్రమోట్ చేయడం సహా ఈ రంగానికి ఊతమిచ్చేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. న్యూఢిల్లీలో బుధవారం ‘శిల్ప గురు, జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రణబ్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశంలో హస్తకళల రంగం ఛిన్నాభిన్నమై అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఆధునిక డిజైన్లు కొరవడటం, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందకపోవడం, ముడి సరుకుల కొరత, తగిన రుణ సదుపాయాలు లేకపోవడం, మిల్లులు, కర్మాగారాల్లో తయారవుతున్న ఉత్పత్తుల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. హస్తకళల రంగానికి ఊతమిచ్చేందుకు వివిధ స్థాయిల్లో పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, ముఖ్యంగా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి ఇచ్చే రుణాలను సులభతరం చేసి వాటిని మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చి హస్తకళా ఉత్పత్తులకు దేశ, విదేశీ మార్కెట్లలో విస్తృత ప్రచారాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ప్రణబ్ పేర్కొన్నారు. హస్తకళలను స్పాన్సర్ చేయడం, పరిశోధనలు నిర్వహించడం ద్వారా విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఈ రంగం అభివృద్ధికి దోహదం చేయగలుగుతాయని, దీంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చి స్థానిక చేతివృత్తుల వారి డిజైన్లను, వారి సాంప్రదాయ పనిముట్లను మెరుగుపరిచేందుకు వీలవుతుందన్నారు. గ్రామీణ స్థాయిలో హస్తకళలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ప్రణబ్ వక్కాణిస్తూ, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక అకాడమీని ఏర్పాటు చేయాలని తలపెట్టడం హర్షణీయమన్నారు.

చిత్రం.. ‘శిల్ప గురు’ అవార్డులను ప్రదానం చేస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ