బిజినెస్

ఒప్పందం మేరకే బొగ్గు వినియోగించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: సింగరేణి సంస్థతో చేసుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు వినియోగించుకుంటామని సిమెంట్ సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. సింగరేణి నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేస్తోందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం నాడిక్కడ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో సింగరేణి కోల్ మూవ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (ఇడి) ఎన్ శ్రీనివాస్ సమక్షంలో సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిమెంట్ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ తాము సింగరేణి కంపెనీతో చేసుకున్న ముందస్తు ఒప్పందానికి అనుగుణంగా కేటాయించిన బొగ్గును వినియోగించుకుంటామని ఇడికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇడి శ్రీనివాస్ మాట్లాడుతూ సిమెంట్ కంపెనీలకు ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన గ్రేడ్ బొగ్గును రవాణా చేయడానికి కంపెనీ వ్యాప్తంగా ఉన్న బొగ్గు డిస్పాచ్ పాయింట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. ఒప్పందం ప్రకారం రానున్న నాలుగు నెలల్లో బొగ్గు సరఫరాకు తాము సిద్ధంగా ఉన్నామని, కేటాయించిన బొగ్గును వినియోగించుకుని తమకు సహకరించాలని ఆయన కోరారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 60.03 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. డిసెంబర్ 10 వరకు రికార్డు స్థాయిలో 39.80 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని చెప్పారు. 2016 జనవరిలో విద్యుదుత్పత్తి చేయనున్న సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్‌ను తీసుకోవడానికి కూడా అంగీకారం తెలపాలని శ్రీనివాస్ సిమెంట్ సంస్థల ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ అధికారులతో పాటు 30 మంది సిమెంట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.