బిజినెస్

మాల్యా పాస్‌పోర్టు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పాస్‌పోర్టును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడిన మాల్యా.. చెప్పాపెట్టకుండా విదేశాలకు చెక్కేసినది తెలిసిందే. ఈ క్రమంలో ఐడిబిఐ బ్యాంక్ నుంచి మాల్యా తీసుకున్న 900 కోట్ల రూపాయలకుపైగా రుణం కేసులో మనీలాండరింగ్‌పై విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సూచన తర్వాత విదేశాంగ శాఖ తాజా నిర్ణయానికి వచ్చింది. విచారణకు హాజరుకావాలని మూడుసార్లు సమన్లు పంపించినప్పటికీ వాటిని మాల్యా బేఖాతరు చేసిన నేపథ్యంలో, ఆయనపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారి చేసిన క్రమంలో పాస్‌పోర్టును ఉపసంహరించుకుంటున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. నిజానికి ఈ నెల 15న మాల్యాకున్న డిప్లమాటిక్ పాస్‌పోర్టును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ షోకాజ్ నోటీసును కూడా జారీ చేసింది. అయితే దానికి సరైన స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయానికొచ్చింది. మరోవైపు మాల్యాకు బ్రిటన్‌లో ఓటు హక్కు ఉన్నట్లు తెలుస్తోంది.