బిజినెస్

జనవరి-మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 4: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జెఎస్‌పిఎల్) ఏకీకృత నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 371 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే వ్యవధిలో నష్టం 519 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 4,874 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 4,558 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. ఇక మొత్తం 2015-16 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఏకీకృత నష్టం 1,902 కోట్ల రూపాయలుగా ఉంది. 2014-15లో ఇది 1,278 కోట్ల రూపాయలుగా ఉంది. ఏకీకృత ఆదాయం కూడా గతంతో పోల్చితే 19,584 కోట్ల రూపాయల నుంచి 18,412 కోట్ల రూపాయలకు పడిపోయింది.
పెరిగిన డిహెచ్‌ఎఫ్‌ఎల్ లాభం
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డిహెచ్‌ఎఫ్‌ఎల్) స్టాండలోన్ నికర లాభం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 16.7 శాతం పెరిగి 189.66 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత జనవరి-మార్చి వ్యవధిలో ఇది 162.28 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాండలోన్ ఆదాయం ఈసారి 1,964.49 కోట్ల రూపాయలుగా ఉండగా, క్రిందటిసారి 1,580.81 కోట్ల రూపాయలుగా ఉంది. ఇకపోతే మొత్తం 2015-16లో సంస్థ ఏకీకృత నికర లాభం 749.30 కోట్ల రూపాయలుగా ఉంది. 2014-15లో ఇది 642.47 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా 6,419.61 కోట్ల రూపాయల నుంచి 7,851.60 కోట్ల రూపాయలకు ఎగిసింది. ఒక్కో షేర్‌కు 8 రూపాయల చొప్పున డివిడెండ్‌ను బుధవారం సంస్థ ప్రకటించింది.
భారీగా క్షీణించిన
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభం
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఏకీకృత నికర లాభం ఈ మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో భారీగా క్షీణించింది. 167 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 737.2 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 10,949.82 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 16,140.92 కోట్ల రూపాయలుగా ఉందని బుధవారం తెలిపింది.
ఎస్‌కెఎస్ మైక్రో
లాభం రూ. 85 కోట్లు
హైదరాబాద్ ఆధారిత సూక్ష్మ రుణాల సంస్థ ఎస్‌కెఎస్ మైక్రో ఫైనాన్స్ స్టాండలోన్ నికర లాభం ఈ జనవరి-మార్చిలో 84.47 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు 40.54 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 370.31 కోట్ల రూపాయలుగా, పోయినసారి 226.2 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం 2015-16 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం 302.98 కోట్ల రూపాయలుగా ఉంటే, 2014-15లో 187.66 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 803.07 కోట్ల రూపాయల నుంచి 1,320.67 కోట్ల రూపాయలకు చేరుకుందని బుధవారం సంస్థ స్పష్టం చేసింది.
రెండింతలైన వి-గార్డ్ లాభం
కన్జ్యూమర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వి-గార్డ్ ఇండస్ట్రీస్ నికర లాభం ఈ జనవరి-మార్చిలో 41.97 కోట్ల రూపాయలుగా నమోదైంది. క్రిందటిసారి ఇది 20.07 కోట్ల రూపాయలుగానే ఉంది. నికర అమ్మకాలు 439.53 కోట్ల రూపాయల నుంచి 510.07 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇక మొత్తం 2015-16లో సంస్థ లాభం 111.68 కోట్ల రూపాయలుగా, 2014-15లో 70.72 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు కూడా 1,730.47 కోట్ల రూపాయల నుంచి 1,849.77 కోట్ల రూపాయలకు పెరిగాయని బుధవారం సంస్థ స్పష్టం చేసింది.