బిజినెస్

సరికొత్త చిల్లర వాణిజ్య విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: తెలంగాణలో రిటైల్ మార్కెట్‌ను ప్రోత్సహించే విధంగా సరికొత్త చిల్లర వాణిజ్య విధానం (రిటైల్ ట్రేడ్ పాలసీ)ను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ముసాయిదా రూపొందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ శుక్రవారం పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమావేశమై ముసాయిదా రూపొందించారు. మార్కెట్ అమ్మకాలతోపాటు వినోదం లభించే విధంగా మార్కెట్లకు రూపకల్పన చేస్తారు. చిల్లర వ్యాపారానికి అవసరం అయిన అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారా ఇవ్వనున్నారు. రిటైల్ మార్కెట్‌కు సంబంధించి ప్రస్తుతం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో మాత్రమే ప్రత్యేకంగా పాలసీలున్నాయ. దీంతో ఈ రెండు రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉండే విధంగా తెలంగాణ రిటైల్ పాలసీకి రూపకల్పన చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. టిఎస్‌ఐపాస్ పాలసీ దేశంలోనేగాకుండా విదేశాల్లో సైతం ఆకట్టుకొంది. అదే తరహాలో రిటైల్ ట్రేడింగ్ పాలసీ సైతం వినూత్నంగా ఉంటుందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. రిటైల్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా పాలసీ ఉంటుందని అన్నారు. దీనివల్ల ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి అమ్మకాలు చేయడం వల్ల ఇటు రైతుకు కూడా మంచి ధర లభిస్తుందని, వినియోగదారునికి నాణ్యమైన సరుకు సరైన ధరకు దొరికినట్లవుతుందని అంటున్నారు. కాగా, ఏక గవాక్ష (సింగిల్ విండో) పద్ధతి ద్వారా అనుమతులు ఇవ్వడానికి అవసరం అయిన ఏర్పాట్లు చేసి ప్రభుత్వంలో ఒక నోడల్ అధికారిని నియమిస్తారు. రిటైల్ వ్యాపారానికి అవసరం అయిన మానవ వనరులకు తగిన శిక్షణ ఏర్పాట్లూ, ప్రోత్సహకాలు కల్పిస్తారు. మొత్తంగా తెలంగాణలో చిల్లర వర్తకానికి ప్రోత్సాహం అందించే పాలసీకి రూపకల్పన జరిగినట్టు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ సమావేశంలో తెలిపారు. మరోవైపు అవసరమైన భద్రత ఏర్పాట్లతో మహిళా ఉద్యోగులు సైతం రాత్రి పది గంటల తరువాత పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. మహిళలకు ఉపా ధి అవకాశాలు, రైతులకు మంచి ధర లభించేలా చర్యలుండను న్నాయ. సమావేశంలో ఉన్నతాధికారులు ఎంజి గోపాల్, ఆజయ్ మిశ్రా, రాజీవ్ త్రివేది, మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.