బిజినెస్

అమరావతిలో ఆర్‌బిఐ కార్యాలయం ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, హెలికాప్టర్లు, చిన్న విమానాలు దిగేందుకు వీలుగా ఒక హెలిప్యాడ్‌ను కూడా నిర్మించాలని అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపి సీడ్ ఫార్మ్‌లో 120 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, అక్కడ హెలిప్యాడ్ నిర్మించాలని సూచించారు. శుక్రవారం ఆయన కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. రాష్ట్ర విభజన జరిగి 24 నెలలు గడచిందని, హైదరాబాద్‌లోనే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్‌బిఐ సేవలు అందిస్తోందని గుర్తుచేశారు. నవ్యాంధ్రప్రదేశ్ అవతరించినందు వల్ల అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్‌బిఐ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలు హైదరాబాద్‌కు వచ్చి ఆర్‌బిఐ సేవలు పొందేందుకు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్‌బిఐ కూడా పరిశీలించి సానుకూలంగా స్పందించాలని కోరారు.

శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతున్న
హావెల్స్ ఇండియా ఉపాధ్యక్షుడు వివేక్ యాదవ్

‘వడ్డీరేట్ల తగ్గింపు దిశగా బ్యాంకులు?’
న్యూఢిల్లీ, మే 6: దేశీయ బ్యాంకులు సెప్టెంబర్‌కల్లా రుణాలపై వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును దించుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలో కావాల్సినన్ని నిధులున్నాయంది. బ్యాంకుల వద్ద ద్రవ్యలభ్యత సరిపడా ఉన్నప్పుడు రుణ మార్కెట్ పెరుగుతుందని, వడ్డీరేట్లు కూడా తగ్గుముఖం పడతాయని ఓ నివేదికలో శుక్రవారం చెప్పింది. ఇక ఆగస్టు 9న జరిపే ద్రవ్యసమీక్షలో రెపో రేటును ఆర్‌బిఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు అవకాశాలున్నాయని కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్పింది.