బిజినెస్

విజయ్ మాల్యాపై సెబీ గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: దేశంలోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్ల రుణాలను ఉద్ధేశ్యపూర్వకంగా ఎగ్గొట్టి విదేశానికి పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తమ దర్యాప్తు పరిధిని మరింత పెంచింది. మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యుబి) గ్రూపునకు చెందిన వివిధ సంస్థల ఆర్థిక లావాదేవీల్లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్న సెబి, ఆయా సంస్థల ప్రమోటర్లు నిధులను ఇతర మార్గాలకు మళ్లించి ఉండవచ్చన్న దానిపై దృష్టి కేంద్రీకరించడంతో పాటు ఈ అంశంపై ఇప్పటికే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, ఆ శాఖకు చెందిన ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలను, ప్రభుత్వ విభాగాలను అప్రమత్తం చేసిందని తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయ (ఎస్‌ఎఫ్‌ఐఓ) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.