బిజినెస్

సిపిఐ, త్రైమాసిక ఫలితాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ), అలాగే పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలులు లాంటి కీలకమైన ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం దేశీయ మార్కెట్ల గతిని నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. తదుపరి విడత నాలుగో త్రైమాసికం ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అలాగే అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌లు ఈ వారం మార్కెట్ తీరును నిర్ణయించనున్నాయి. కంపెనీ మేనేజిమెంట్లు తమ రాబడి అంచనాలపై చేసే వ్యాఖ్యలపై మదుపరులు ఇకపై కూడా దృష్టిపెట్టడం కొనసాగుతుందని, ఇదే మార్కెట్లు ఏ ధోరణిలో సాగుతాయో నిర్ణయిస్తుందని ‘ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్’ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అభిప్రాయ పడ్డారు. మార్చి నెల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు, అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) గణాంకాలు ఈ నెల 12న వెలువడనున్నాయి. ఇవే కాక విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టే తీరు, డాలరుతో రూపాయి కదలికలులాంటివి కూడా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌పై ప్రభావం చూపించనున్నాయి. ఈ వారం తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న బడా కంపెనీల్లో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్), కోటక్ మహీంద్ర బ్యాంక్, ఏసియన్ పెయింట్స్ లాంటివి ఉన్నాయి. మొత్తంమీద మార్కెట్లు అమ్మకాల జోన్‌లోనే కొనసాగవచ్చు. నిఫ్టీ క్రిందటి 8 వేల పాయింట్ల గరిష్ఠ స్థాయికి మళ్లీ చేరుకోవాలంటే బహుశా అసెంబ్లీ ఎన్నికల పలితాలు ఒక్కటే దోహదపడుతుందని తాము భావిస్తున్నట్లు సింఘానియా చెప్పారు. ఈ నెల 12న ప్రకటించే సిపిఐ,ఐఐపి గణాంకాలను బట్టే మార్కెట్ స్పందన ఉంటుంది. నెస్లే, డాక్టర్ రెడ్డీస్, ఏసియన్ పెయింట్స్‌లాంటి కంపెనీల ఫలితాలను కూడా మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తుంది. ఇండియన్ బ్యాంక్,అలహామాద్ బ్యాంక్ లాంటి పిఎస్‌యు బ్యాంక్‌ల ఫలితాలను కూడా వాటి నిరర్థక ఆస్తులు, వాటి లాభాల వివరాల కోసం జాగ్రత్తగా గమనించే అవకాశముందని ‘మనీపామ్’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓ నిర్దోష్ గౌర్ అభిప్రాయ పడ్డారు.
అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు వరసగా రెండోవారం కూడా నష్టాల్లో ముగియడం తెలిసిందే. బిఎస్‌ఇ సెనె్సక్స్ గతవారం 1.48 శాతం నష్టపోయి 25,228.50 పాయింట్ల వద్ద ముగిసింది. 2-3 నెలలు లాభాల బాటలో సాగిన తర్వాత మార్కెట్లు ఇప్పుడు ఆటుపోట్ల మధ్య ఊగిసలాడుతున్నాయి. మిగతా త్రైమాక ఫలితాలు, రుతుపవనాలకు సంబంధించి వెలువడబోయే ప్రకటనలతో పాటుగా ప్రపంచ మార్కెట్ల ధోరణులు సమీప భవిష్యత్తులో మార్కెట్ల తీరుతెన్నులను నిర్ణయిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ దీపేన్ షా అభిప్రాయ పడ్డారు.
ఈ నెలలోనే మహానగర్ గ్యాస్ ఐపిఓ
ఇదిలా ఉండగా దేశంలో సిఎన్‌జి విక్రేతల్లో రెండో స్థానంలో ఉన్న మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఈ నెలలోనే తన తొలి పబ్లిక్ ఇష్యూతో మార్కెట్లలోకి ప్రవేశించనుంది. ఈ ఐపిఓలో కంపెనీలో ప్రధాన వాటాదారులయిన బిటీష్ గ్యాస్ ఇండియా లిమిటెడ్, ప్రభుత్వ రంగ సంస్థ అయిన గెయిల్ చెరి 12.5 శాతం వాటాలను విక్రయించనున్నాయని గెయిల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బిసి త్రిపాఠీ చెప్పారు. ప్రస్తుతం ఈ ఐపిఓకు సంబంధించిన రోడ్‌షోలు జరుగుతున్నాయని, ఈ నెల మూడో వారంలో ఐపిఓ మార్కెట్లోకి రావచ్చని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. ఈ ఐపిఓ ద్వారా ఎంత మొత్తం సేకరించనున్నారో ఆయన చెప్పకపోయినప్పటికీ ఈ మొత్తం వెయ్యినుంచి 1200 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మహానగర్ గ్యాస్ లిమిటెడ్‌లో ప్రస్తుతం ఈ రెండు కంపెనీలకు చెరి 49.75 శాతం చొప్పున వాటాలుండగా, మహారాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 0.49 శాతం ఉంది.