బిజినెస్

చేయాల్సింది చాలా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 13: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా మరికొంత కాలం కొనసాగాలన్న ఆకాంక్షను రఘురామ్ రాజన్ వ్యక్తం చేశారు. ఆర్‌బిఐ గవర్నర్‌గా ప్రస్తుతం అనుక్షణం ఆనందిస్తున్నానని, తన ప్రతి చర్యపై సంతృప్తిని వెలిబుచ్చారు. అయితే చేయాల్సింది ఇంకా చాలానే మిగిలి పోయిందన్న రాజన్.. ఈ క్రమంలోనే రెండోసారి ఆర్‌బిఐ పగ్గాలు చేపట్టాలన్న కోరికను బయటపెట్టారు. ఆర్‌బిఐ గవర్నర్‌గా ఈ ఏడాది సెప్టెంబర్‌తో రఘురామ్ రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. దీంతో ఆయన్ను మళ్లీ ఆ పదవిలో కొనసాగించవద్దని అధికార బిజెపి నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది. బిజెపి సీనియర్ నేత సుబ్రమణ్యన్ స్వామి గురువారం పార్లమెంట్ వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ రఘురామ్ రాజన్‌పై తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తారు. నిరుద్యోగం, పారిశ్రామిక ప్రగతి క్షీణించడం వంటి వాటికి కారణం రాజనేనని, ఆర్‌బిఐ గవర్నర్ హోదా నుంచి ఆయన్ను తీసేయాల్సిన అవసరముందని విమర్శలు గుప్పించారు. వడ్డీరేట్లను పెంచారని, ద్రవ్యోల్బణం అదుపులో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ పర్యటనలో ఉన్న రాజన్.. శుక్రవారం సి ఎన్‌బిసి వార్తా చానెల్‌తో మాట్లాడుతూ మళ్లీ ఆర్‌బిఐ గవర్నర్‌గా సేవలందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇదిలావుంటే ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాలేదంటూ ఇప్పట్లో కీలక వడ్డీరేట్ల తగ్గింపు ఉండబోదన్న సంకేతాలను రాజన్ ఈ సందర్భంగా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగానే ఉందన్న ఆయన విదేశీ మార్కెట్ల నుంచి డాలర్లలో అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అలాగే భారత్‌లో లెహ్మన్ మూవ్‌మెంట్‌కు అవకాశమే లేదన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడేలా భారత ఆర్థిక వ్యవస్థకు మూడంచెల భద్రతా వలయం ఉందని గుర్తుచేశారు. కాబట్టి ‘లెహ్మన్’ సంక్షోభం భారత్‌లో తలెత్తబోదన్నారు.