బిజినెస్

22-23 తేదీల్లో ఇరాన్‌కు మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22-23 తేదీల్లో ఇరాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆర్థిక అంశాలపై ఆయన ఆ దేశంతో చర్చించనున్నారు. మళ్లీ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను రెట్టింపు చేసుకోవాలని భారత్ చూస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటనలో ఆ దిశగా సంప్రదింపులు జరిగే వీలుంది. కాగా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ఆ దేశంలో మోదీ రెండు రోజులు పర్యటిస్తున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఇరాన్‌లో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోదీ కూడా పర్యటించనుంగా, ఇరాన్ దేశాధ్యక్షుడు హసన్ రౌహనితో ఇరు దేశాల ద్వైపాక్షిక ప్రయోజనాలపై మోదీ చర్చిస్తారని, వాణిజ్యం, వౌలిక, ఇంధన భాగస్వామ్య అంశాలు ప్రస్తావనకు వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.