బిజినెస్

పాత ఇళ్లకు కొత్త రూపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, మే 17: పక్క భవనాలకు ముప్పు లేకుండా భవనాలు కూల్చడం గురించి ఇంతవరకు విన్నాం. అయితే తక్కువ ఎత్తులో ఉన్న భవనాన్ని పునాదుల వద్ద ప్రత్యేక విధానం ద్వారా లేపుతూ మొత్తం భవనం ఎత్తు పెంచే ప్రక్రియ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడులో విజయవంతంగా చేపట్టారు. ఈ విధానంలో భవనంలో ఉన్న ఫర్నిచర్ తదితరాలు చెక్కు చెదరకుండా ఉండటం మరో విశేషం. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో సుమారు 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఒక భవనాన్ని కొల్లేపర నాగభూషణం 25 ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు. రావులపాలెంలో ఫ్యాన్సీషాపు నిర్వాహకుడైన నాగభూషణం ఇల్లు లోతట్టుగా ఉండటంతో అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఉన్న భవనాన్ని కూల్చి కొత్త భవనం నిర్మించాలంటే సుమారు రూ. 30 లక్షల వరకు వ్యయం అవుతుంది. దీనితో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆయన దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న ఆయన అల్లుడు వి శరత్ ద్వారా ఉన్న భవనం కూల్చనవసరం లేకుండా ఎత్తు పెంచవచ్చని తెలుసుకున్నారు. దీనికోసం హర్యానా రాష్ట్రానికి చెందిన శ్రీరాం బిల్డింగ్ లిఫ్టింగ్ వర్క్స్ నిర్వాహకులను సంప్రదించారు. ఈ సంస్థ యజమాని వికాస్ సిసోడియా ఈ భవనాన్ని ప్రత్యేక విధానంలో నాలుగు అడుగుల వరకు ఎత్తు పెంచవచ్చని తెలిపారు. ఈ మేరకు సుమారు 10 మంది కార్మికులతో పదిహేను రోజుల క్రితం పనులు ప్రారంభించారు. మొత్తం ఇంటిని పునాదుల నుండి వేరుచేసి, సుమారు 125 జాకీలపై నిలబెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ భవనం ఎత్తు పునాదుల నుండి సుమారు 4 అడుగులు పెరిగింది. భవనాన్ని పైకి లేపడం ద్వారా వచ్చిన నాలుగు అడుగుల ఖాళీలో పిల్లర్లు, గోడలు నిర్మించి, పాత భవనంతో కలిపి, పటిష్ఠపరుస్తామని సిసోడియా తెలిపారు. ఈ భవనంపై మరో రెండు అంతస్తులు నిర్మించినా ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు. 1989 నుంచి తమ తాతల హయాం నుంచే ఈ విధానంలో భవనాల ఎత్తు పెంచుతున్నామన్నారు. ఇప్పటివరకు సుమారు ఐదు వేల భవనాల ఎత్తును ఈ విధంగా పెంచామని చెప్పారు. మూడుసార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో కూడా స్థానం దక్కించుకున్నామని తెలిపారు. కాగా, ఇలా ఉన్న ఇంటిని ఎత్తు పెంచడం పరిసర ప్రాంతాల్లో జరగడం ఇదే తొలిసారి కావడంతో చూడటానికి పెద్దయెత్తున ప్రజలు తరలివస్తున్నారు. మరో 15 రోజుల్లో మొత్తం పని పూర్తవుతుందని ఇంటి యజమాని నాగభూషణం తెలిపారు. ఈ విధానం పల్లంగా మారిన గృహాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఎత్తు పెంచే కార్యక్రమానికి 4 లక్షల రూపాయల ఖర్చయ్యంది.

1. జాకీలపై నాలుగు అడుగుల ఎత్తులో నిలబెట్టిన ఇల్లు
2. పునాదుల వద్ద పూర్తిగా పైకిలేచిన ఇంటి కింది భాగం
3. చెక్కు చెదరని ఇంటి లోపలి భాగం 4. ఎత్తు పెరిగిన ఇల్లు ఇదే