బిజినెస్

అమ్మకాల ఒత్తిడిలో ఆటో షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 18: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. గత రెండు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 69 పాయింట్లు పడిపోయి 25,704.61 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 20.60 పాయింట్లు దిగజారి 7,870.15 వద్ద నిలిచింది. మారుతి, మహీంద్ర, రెనాల్ట్, హ్యుందాయ్ సంస్థలకు చెందిన పలు మోడళ్ల కార్లు.. క్రాష్ టెస్టులో విఫలమైన నేపథ్యంలో ఆటో రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆయా రంగాలవారీగా చూస్తే ఆటో, యుటిలిటీస్, పవర్, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు 1.28 శాతం నుంచి 0.28 శాతం నష్టపోయాయి. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్ రంగాల షేర్ల విలువ 2.11 శాతం నుంచి 0.61 శాతం వరకు పెరిగింది. అంతర్జాతీయంగా కూడా ఆసియా, ఐరోపా మార్కెట్లలో మెజారిటీ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. దీంతో ఈ ప్రభావం కూడా భారతీయ మార్కెట్లపై పడింది.

‘నిర్మాణాత్మక సంస్కరణలతోనే వృద్ధి’
న్యూఢిల్లీ, మే 18: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 8 శాతానికి చేరాలంటే నిర్మాణాత్మక సంస్కరణలు కీలకమని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పి) తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రభావంతో భారత్ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ.. నిర్మాణాత్మక సంస్కరణలతో వాటిని అధిగమించవచ్చని ఈ గ్లోబల్ రేటింగ్ దిగ్గజం అభిప్రాయపడింది. పార్లమెంట్‌లో దివాళా బిల్లు ఆమోదం పొందడాన్ని అభినందించిన ఎస్‌అండ్‌పి.. రాబోయే వర్షాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చింది.