బిజినెస్

విశాఖ రైల్వే స్టేషన్‌లో వైఫై సదుపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/విశాఖపట్నం, మే 20: రైల్వే స్టేషన్లలో ఆధునిక సదుపాయల కల్పనకు కేంద్ర రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం, పాట్నా, రాంచీ రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను శుక్రవారం న్యూఢిల్లీలోని రైల్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. విశాఖ, రాంచీ, పాట్నా ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రైల్వే మంత్రిత్వ శాఖ అధ్యర్వంలో నడిచే రైల్‌టెల్ సంస్థ, గూగుల్ సాంకేతిక భాగస్వామ్యంలో ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా నాలుగు వందల స్టేషన్లలో వైఫై ద్యారా ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ప్రకటించారు. ఈ ఏడాది చివరి కల్లా రైల్వే స్టేషన్లలో కోటి మంది ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి వం ద స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తామని సురేష్ ప్రభు తెలిపారు. ఈ సేవలు దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో ప్రారంభమైయ్యాయని, అక్కడ ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని రైల్వే మంత్రి అన్నారు. రైల్‌టెల్ సంస్థ ద్వారా మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి రైల్వేబోర్డు చైర్మన్ వికె గుప్తా, రైల్‌టెల్ ఎండి ఆర్‌కె బహుగుణ హాజరయ్యారు. ఇదిలా ఉండగా సురేష్ ప్రభు ప్రారంభించిన విధానాన్ని విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు వీక్షించారు. ప్రయాణికులకు హైస్పీడ్ బ్రాడ్ బాండ్ అనుభూతిని అందించేలా రైల్‌టెల్ ఫైబర్ నెట్‌వర్క్‌పై ఈ సేవలు రూపొందించారన్నారు. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ కలిగి ఉండే ప్రతిఒక్కరూ ఈ సేవలు పొందవచ్చన్నారు. ఈ స్టేషన్ల ద్వారా ప్రయాణించే వారు ఇపుడు సులభంగా హై డెఫినిషన్ వీడియోను చూడగలుగుతారని చెప్పారు. రోజుకు 10 మిలియన్ల మందికి హై స్పీడ్ వైఫై నెట్‌వర్క్‌ను అందించేందుకు భారతీయ రైల్వే, రైల్‌టెల్, గూ గూల్ సిద్ధమైయ్యాయన్నారు. ఎమ్మెల్యేలు పిజివిఆర్ నాయుడు, పి విష్ణుకుమార్ రాజు, వాల్తేరు డివిజన్ అధికారులు హరిబాబుతో ఉన్నారు.
విశాఖ పోర్టు ట్రస్ట్‌కు కొత్త రైల్వే లైన్
న్యూఢిల్లీ: విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌కు కొత్తగా రెండు రైల్వే లైన్లును కేంద్రం కేటాయించింది. సాగరమాల కార్యక్రమంలో భాగంగా దాదాపు 27 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. తూర్పు గ్రిడ్ నుండి పోర్టు యార్డులోని ఉత్తర దిశవైపు రైల్వే లైన్ కోసం 9.28 కోట్ల రూపాయలతో ఎన్‌ఎడి వైపు నుండి ఒర్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ పశ్చిమ దిశవైపు రైల్వే లైన్ కోసం 16.75 కోట్ల రూపాయలతో రైల్వే లైన్ నిర్మాణాలు చేపట్టనుంది. డిసెంబర్, జనవరి నాటికి రెండు ప్రాజెక్టులను పూర్తిచేసేలా డెడ్‌లైన్ విధించింది. ఈ రైల్వే లైన్ల నిర్మాణ పనులను ఇండియన్ పోర్టు రైల్వే కంపెని లిమిటెడ్‌కి మోదీ సర్కారు అప్పగించింది. పోర్టులకు రైల్వే లైన్లు అనుసంధానం చేసే కార్యక్రమమే ఈ సాగరమాల పథకం.

న్యూఢిల్లీలోని
రైల్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ఉచిత వైఫై
సేవలను ప్రారంభిస్తున్న రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు