బిజినెస్

ప్రపంచ బ్యాంక్ బృందంతో ఎపి సిఆర్‌డిఎ అధికారుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో చేపట్టనున్న ప్రాజెక్టులు, వౌలిక వసతుల కోసం అవసరమైన రుణం మంజూరుకు ఎపి సిఆర్‌డిఏ ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించేందుకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్ బృందం మంగళవారం విజయవాడ సిఆర్‌డిఎ కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది. సాంకేతిక నిపుణులు, పట్టణ ప్రణాళికాధికారులు, ఆర్థిక, సామాజిక, పర్యావరణ నిపుణులతో కూడిన ప్రపంచ బ్యాంక్ బృందం సభ్యులు ఎపి సిఆర్‌డిఎ, ఏడిసి అధికారులతో చర్చలు జరిపారు.
అమరావతిలో రహదారులు, ఇతర వౌలిక సదుపాయాలు, వరద నిర్వహణ, మురుగు నీరు, వ్యర్థాల నిర్వహణ తదితర ప్రాజెక్టులతోపాటు అమరావతి ప్లానింగ్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, అమరావతి అర్బన్ ఆర్ట్స్ కమిషన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు రుణంగా అందించేందుకు ఎపి సిఆర్‌డిఏ సమర్పించిన ప్రతిపాదనల వివరాలు తెలుసుకున్నారు. అలాగే ప్రపంచ బ్యాంక్ బృందం సభ్యులు రుణం అర్హతకు అవసరమైన అంశాలపై ఎపి సిఆర్‌డిఎ అధికారులతో ఫ్రేం వర్క్ తదితర అంశాలలో రుణ మంజూరుకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు.
కాగా, ప్రపంచ బ్యాంక్ బృందం అమరావతి నగరంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటన జరిపి నివేదిక రూపొందించనుంది.

ప్రపంచ బ్యాంకు అధికారులతో
సమావేశమైన సిఆర్‌డిఎ అధికారులు

5జి నెట్‌వర్క్‌పై
నోకియా నజర్!
న్యూఢిల్లీ, మే 24: దేశంలోని టెలికామ్ సంస్థలతో 5జి నెట్‌వర్క్‌పై నోకియా చర్చలు జరుపుతోంది. దేశీయంగా ఇంకా 4జి సేవలు పూర్తిస్థాయిలో విస్తరించకముందే నోకి యా నెట్‌వర్క్ 5జి సేవలపై దృష్టి సారించడం గమనార్హం. ఇప్పటికే వెరిజోన్, ఎస్‌కె, ఎన్‌టిటితో కలిసి విదేశాల్లో 5జిని పరీక్షించింది.