బిజినెస్

భారత్‌లో పెట్టుబడులపై జపాన్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, మే 29: భారతీయ వౌలికరంగాభివృద్ధిని జపాన్ మదుపరులు దగ్గరగా గమనిస్తున్నారని, ఈ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారని, భారత్‌లోని వివిధ రంగాల్లో పెట్టుబడులతో వస్తామని చెబుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం జపాన్‌కు చేరిన జైట్లీ.. అక్కడ జపాన్ బహుళవ్యాపారరంగ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ సిఇఒ మసయోషి సన్‌తో సమావేశమయ్యారు. ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ నుంచి భారత్‌లోకి భారీగా పెట్టుబడులను పట్టుకురావడమే లక్ష్యంగా జైట్లీ ఈ పర్యటనను చేస్తున్నారు. కాగా, జైట్లీతో సమావేశం అనంతరం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ సిఇఒ మసయోషి సన్ మాట్లాడుతూ సౌర విద్యుదుత్పత్తి రంగంతోపాటు ఇంటర్నెట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ఓ జాయింట్ వెంచర్ ద్వారా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాఫ్ట్‌బ్యాంక్ పెడుతోంది. నిరుడు జూన్‌లో భారతీ ఎంటర్‌ప్రైజెస్, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీలతో కలిసి భారతీయ పునరుత్పాదక శక్తి రంగంలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సాఫ్ట్‌బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. 20 గిగావాట్ల విద్యుదుత్పత్తి ఈ జాయింట్ వెంచర్ లక్ష్యం. జైట్లీ మాట్లాడుతూ ‘్భరత వౌలికరంగాభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు జపాన్ మదుపరులు ఆసక్తిగా ఉన్నారు.’ అని అన్నారు. ఇదిలావుంటే గడచిన రెండేళ్లలో భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు 2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్నాప్‌డీల్, ఓలా క్యాబ్స్‌లలో 627 మిలియన్ డాలర్లు, 210 మిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టింది. రాబోయే 10 ఏళ్లలో భారతీయ ఈ-కామర్స్ వ్యాపారం 500 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇంతకుముందు మసయోషి సన్ అంచనా వేసినది తెలిసిందే.

సాఫ్ట్‌బ్యాంక్ సిఇఒ మసయోషి సన్‌తో అరుణ్ జైట్లీ