బిజినెస్

ఆర్థిక ఫలితాలు, వర్షాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: టాటా మోటార్స్, ఎన్‌టిపిసి తదితర దిగ్గజ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, వర్ష సమాచారం ఆధారంగా ఈ వారం మదుపరులు తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మే నెలకు సంబంధించి ఆటోరంగ సంస్థలు విడుదల చేసే అమ్మకాల వివరాలు కూడా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని వారు చెబుతున్నారు. ‘గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చికిగాను తుది విడతగా కార్పొరేట్, ప్రభుత్వరంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు మదుపరుల పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి. వర్షాల సమాచారం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు కూడా ట్రేడింగ్‌ను శాసిస్తాయి.’ అని బ్రోకరేజ్ సంస్థ ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. కాగా, అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు స్పందించే తీరు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని అన్నారు. ఇకపోతే ఈ వారం వెల్లడవనున్న జిడిపి గణాంకాలు కూడా కీలకమేనన్నారు. ‘మే నెల ఆటో అమ్మకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం ట్రేడింగ్‌లో ప్రధానం.’ అని మనీపామ్ ఎండి, సిఇఒ నిర్దోశ్ గౌర్ అన్నారు. ఇకపోతే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు కూడా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఏకంగా 1,351.70 పాయింట్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 406.95 పాయింట్లు పుంజుకున్నది తెలిసిందే.