బిజినెస్

ఐరోపాలో గ్రేబుల్ చేతికి టాటా స్టీల్ వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: ఐరోపాలోని లాంగ్ స్టీల్ వ్యాపార అమ్మకం పూర్తయినట్లు టాటా స్టీల్ బుధవారం ప్రకటించింది. స్కన్‌థోర్ప్ ప్లాంట్‌తోసహా మొత్తం టాటా స్టీల్ యుకె బిజినెస్‌ను గ్రేబుల్ క్యాపిటల్ ఎల్‌ఎల్‌పికి అమ్మేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఏళ్ల తరబడిగా నష్టాల్లో నడుస్తున్న టాటా స్టీల్ బ్రిటన్ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు ఈ ఏడాది మార్చిలో టాటా గ్రూప్ ప్రకటించినది తెలిసిందే. దీంతో జిందాల్ గ్రూప్ కూడా కొనేందుకు ప్రయత్నించగా, గ్రేబుల్ సొంతం చేసుకుంది. ఈ లాంగ్ స్టీల్ వ్యాపారంపై 4,800 మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. బ్రిటన్‌లో 4,400, ఫ్రాన్స్‌లో 400 మంది పనిచేస్తున్నారు. అయతే ఎంత మొత్తానికి లావాదేవీలు పూర్తయ్యాయన్న వివరాలు తెలియరాలేదు. కానీ కొత్త వ్యాపారంపై 569 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గ్రేబుల్ ఇంతకుముందు ప్రకటించింది.

లాభాల బాటలో డిసిఐ

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 1: ప్రభుత్వరంగ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16) లో 79.67 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. గత ఎనిమిదేళ్లలో డిసిఐ సాధించిన లాభాల్లో ఇదే అత్యధికం. ఇక గడచిన ఆర్థిక సంవత్సరంలో డిసిఐ వార్షిక టర్నోవర్ 676.22 కోట్ల రూపాయలుగా నమోదైంది. సంస్థ షేర్ ప్రస్తుత మార్కెట్‌లో 28.45 రూపాయలుగా కొనసాగుతోంది. కాగా, ఇటీవల సంస్థ బోర్డు డైరెక్టర్ల సమావేశం నిర్వహించి, వాటాదారు లకి 30 శాతం డివిడెండ్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి 10 రూపాయల ఈక్విటీ షేర్‌కుగాను, 3 రూపాయ లను డివిడెండ్‌గా ప్రకటిం చింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇప్పటికే విపరీతమైన పోటీని ఎదుర్కొంటోందని, స్వదేశీ ప్రైవేటు సంస్థలతోపాటు విదేశీ సంస్థలు విస్తృత స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని డైరెక్టర్ల సమావేశంలో బోర్డు అభిప్రాయపడింది. విపరీతమైన పోటీ నెలకొన్న పరిస్థితుల్లో సైతం సంస్థ తన పనితీరును మెరుగుపరచుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టింది. మరోవైపు ప్రస్తు తం డిసిఐ కోల్‌కతా, హల్దియా, మార్మ్‌గోవా, విశాఖపట్నం, కొచ్చి, ఎన్నూర్, ధబోల్, చెన్నై పోర్టుల్లో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేస్తోంది.