బిజినెస్

ఎదురులేని ఆర్థిక వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూన్ 1: భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో మరింత ముందుకు దూసుకెళ్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌లో పర్యటిస్తున్న జైట్లీ.. మంగళవారం విడుదలైన స్థూల దేశీయోత్పత్తి (జిడిపి), వౌలికరంగాభివృద్ధి అంచనాలపై బుధవారం ఇక్కడ స్పందించారు. తాజా గణాంకాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఎత్తుకు ఎదిగిందని పేర్కొన్నారు. ఈసారి వర్షాలు సక్రమంగా పడితే, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు కూడా పార్లమెంట్ ఆమోదానికి నోచుకుంటే ఈ అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, వౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ భారతంలో తలసరి ఆదాయం పెంచడం వంటి చర్యలు వృద్ధి వేగానికి చోదక శక్తులుగా పనిచేస్తాయని వెల్లడించారు. కేంద్రంలోని తమ ప్రభుత్వ వృద్ధి అనుకూల విధానాల అమలుతో జిడిపి అనుకున్నదానికంటే కూడా పెరిగి ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 7.9 శాతానికి ఎగిసిందని తెలిపారు. ఇక జిడిపి వృద్ధిరేటు గత ఆర్థిక సంవత్సరం (2015-16) మొత్తంగా 7.6 శాతం నమోదవడాన్నీ ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇవేవి కేవలం మెప్పుకోలు కోసం చెప్పే మాటలు కావని, అనేక రకాలుగా వాస్తవాలను విశే్లషించి తెరపైకి తెచ్చినవన్న ఆయన ఇవన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థ అంతర్గతంగా ఎంత పటిష్ఠంగా ఉందో స్పష్టం చేసేవేనన్నారు. ఇదిలావుంటే మొత్తం 8 కీలక రంగాల్లో ఏప్రిల్ నెలలో సాధించిన 8.5 శాతం వృద్ధిరేటును కూడా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపైనే గుణాత్మక ప్రభావాన్ని కనబరిచిందని అభివర్ణించారు. ముఖ్యంగా రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాల్లో సానుకూల వాతావరణం నెలకొందని, అది అన్నివిధాలుగా వృద్ధి వేగాన్ని పెంచిందని తెలిపారు. నిజానికి గత రెండు సంవత్సరాలుగా దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఎన్నో ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పటికీ తాము చేపట్టిన దూరదృష్టితో కూడిన విధానాల కారణంగానే ప్రగతి వేగం సాధ్యమైందని, అన్ని రంగాల్లోనూ అనుకూలత ఏర్పడిందన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మాంద్య పరిస్థితులు ఓపక్క, వరుసగా రెండోసారి కూడా సాధారణ స్థాయి కంటే తక్కువ స్థాయి వర్ష పరిస్థితులు మరోపక్క కలవరపెట్టాయన్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితులున్నా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ ఎలా చేరుకోగలిగిందన్నది చాలామందికి ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయితే ఈ వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థిక సంస్కరణలను కొనసాగిస్తున్నామన్న జైట్లీ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లుకు ఆమోదం లభించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది సాధ్యమైతే జిడిపి వృద్ధిరేటుకు మరింత ఊతం లభిస్తుందని వెల్లడించారు. ఈసారి వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయన్న అంచనాలు ఆనందం కలిగిస్తున్నాయని, ఇది కూడా వృద్ధికి బలాన్నిచే పరిణామమేనని పేర్కొన్నారు. కాగా, దేశీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని, వాటిని ఎగవేసి విదేశాలకు పారిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా వ్యవహారంపై స్పందిస్తూ చట్టాలను ఉల్లంఘించి తప్పించుకోజూసేవారిపై అన్ని దేశాలు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. దీంతో పరోక్షంగా మాల్యాకు చోటిచ్చిన బ్రిటన్ వైఖరిని ఆయన తప్పుబట్టారు. కాగా, బుధవారం ఉద యం జపాన్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, సిఇఒలతో జైట్లీ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు.
chitram..
జపాన్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, సిఇఒలతో జైట్లీ