బిజినెస్

ప్రథమార్ధంలో మరింత బలహీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 3: గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో బ్యాంకుల ఆర్థిక ఫలితాలు ఎంత పేలవంగా నమోదయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వరంగ బ్యాంకులైతే నష్టాల్లో సరికొత్త రికార్డులు సృష్టించాయి. కొన్నైతే వేల కోట్ల రూపాయల నష్టాలను ప్రకటించాయి. దీనంతటికీ కారణం మొండి బకాయిలే (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ). ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లోనూ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు ఇంతకంటే దారుణంగా ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్, బిఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్‌లు వెల్లడించిన సమాచారం ప్రకారం మొండి బకాయిలు మున్ముందు మరింత పెరగనున్నాయి. రాబోయే రెండేళ్లలో ఇప్పుడు భారీగా ఉన్న ఒత్తిడిని ఎదుర్కొంటున్న రుణాలు.. మొండి బకాయిలుగా మారనున్నాయి.
సోమవారం ప్రభుత్వ బ్యాంకర్లతో జైట్లీ సమావేశం
న్యూఢిల్లీ: మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చిలో పెద్ద ఎత్తున నష్టాలపాలైన నేపథ్యంలో మొండి బకాయిల అంశం ప్రధానంగా చర్చకు రానుందని తెలుస్తోంది.

6 నెలల కనిష్టానికి సేవారంగం వృద్ధి
న్యూఢిల్లీ, జూన్ 3: దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని ప్రతిబింబిస్తూ గత నెల సేవారంగం వృద్ధిరేటు ఆరు నెలల కనిష్ట స్థాయికి దిగజారింది. మే నెలలో నిక్కీ సర్వీస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ 51.0గా నమోదైంది. అంతకుముందు నెల ఏప్రిల్‌లో ఇది 53.7గా ఉంది. ఇక ఏప్రిల్‌లో 52.8గా ఉన్న నిక్కీ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పిఎమ్‌ఐ) వృద్ధి.. మే నెలలో 50.9కి పడిపోయింది. దీంతో వచ్చేవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జరిపే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లు తగ్గవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌కు ఉబర్‌పూల్ సర్వీసు
న్యూఢిల్లీ, జూన్ 3: అమెరికాకు చెందిన క్యాబ్ సర్వీస్ ఉబర్.. హైదరాబాద్, కోల్‌కతా, ముంబయిలకు తమ కార్‌పూలింగ్ సర్వీసును విస్తరిస్తోంది. ఈ నెల 5న ఈ ముడు మహా నగరాల్లో ఉబర్‌పూల్ సేవలు అందుబాటులోకి వస్తాయని శుక్రవారం ఉబర్ ఇండియా అధ్యక్షుడు అమిత్ జైన్ పిటిఐకి తెలిపారు. ఆరు నెలల క్రితం దేశంలో ఉబర్‌పూల్ సర్వీసులు మొదలవగా, ప్రస్తుతం ఈ సర్వీసులు ఢిల్లీ, బెంగళూరుల్లో మాత్రమే ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో ఉబర్‌పూల్ వాటా 25 శాతమని జైన్ చెప్పారు. కాగా, ఉబర్ ప్రత్యర్థి అయిన ఓలా క్యాబ్స్ కూడా ఓలా షేర్ అని ఉబర్‌పూల్ మాదిరిగానే నడిపిస్తున్నది తెలిసిందే.