బిజినెస్

ఆటుపోట్ల మధ్య కాస్త అటుఇటుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఎక్కడివక్కడే ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో చివరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ అతి స్వల్పంగా 0.11 పాయింట్లు తగ్గి 26,792.07 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం స్వల్పంగా 1.85 పాయింట్లు పెరిగి 8,220.80 వద్ద నిలిచింది. వచ్చేవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరపనున్న క్రమంలో మదుపరులు పెట్టుబడులపట్ల ఆచితూచి వ్యవహరించారని మార్కెట్ విశే్లషకులు ట్రేడింగ్ సరళిపై స్పందించారు. నిక్కీ సర్వీస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మే నెలలో 51.0కి పడిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
28,800 స్థాయికి సెనె్సక్స్: సిటీగ్రూప్
ఆశాజనక కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఈసారి వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాల మధ్య ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో సెనె్సక్స్ 28,800 స్థాయికి చేరుకోవచ్చని సిటీగ్రూప్ అంచనా వేసింది. నిజానికి ఇంతకుముందు 27,000 పాయింట్లకే సెనె్సక్స్ పరిమితమవుతుందని సిటీగ్రూప్ అంచనా వేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్ సంస్థలు సాధించిన ఆర్థిక గణాంకాలు, వర్షాలు సమృద్ధిగా పడతాయన్న అంచనాలతో సెనె్సక్స్ లక్ష్యాన్ని సిటీగ్రూప్ సవరించింది.
బిఎస్‌ఇలో బాండ్ల వేలం
న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ)లో సోమవారం విదేశీ మదుపరులకు 4,046 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రుణ సెక్యూరిటీ బాండ్లను వేలం వేయనున్నారు. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు వేలం జరుగుతుంది.

టాబ్లెట్ అమ్మకాల్లో డేటావిండ్ దూకుడు
హైదరాబాద్, జూన్ 3: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయంగా టాబ్లెట్ అమ్మకాల్లో డేటావిండ్ దూసుకుపోయింది. 34.2 శాతం అమ్మకాలను నమోదు చేసింది. అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలను అందిస్తూ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న డేటావిండ్ ఐఎన్‌సి.. టాబ్లెట్ అమ్మకాల్లోనూ ముందుందని సిఎమ్‌ఆర్ నివేదిక స్పష్టం చేసినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో డేటావిండ్ తెలియజేసింది. సామ్‌సంగ్ 20.9 శాతంతో రెండవ స్థానంలో ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొందని సదరు ప్రకటనలో డేటావిండ్ చెప్పింది. కాగా, 5,000 రూపాయల ధరల శ్రేణిలో 74 శాతం టాబ్లెట్లను అమ్మింది కూడా తామేనని డేటావిండ్ వివరించింది.