బిజినెస్

కొత్తగా 10 వేల ఎల్‌పిజి పంపిణీదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: వంటగ్యాస్ (ఎల్‌పిజి) వినియోగదారులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కొత్తగా 10 వేల మంది పంపిణీదారులను నియమించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది ఎల్‌పిజి పంపిణీదారులున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌పిజి పంపిణీదారుల సంఖ్య సుమారు 26 వేలకు చేరనుందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ‘2016 సంవత్సరాన్ని ఎల్‌పిజి వినియోగదారుల ఏడాదిగా మేము ప్రకటించాం. 2018 నాటికి దేశంలో ఎలాంటి అవకతవకలు లేని వంటగ్యాస్ సరఫరా వ్యవస్థను తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగానే కొత్తగా మరో 10 వేల మంది డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటు చేస్తున్నాం.’ అని ఇక్కడ విలేఖరులతో ప్రధాన్ అన్నారు. కొత్తగా సుమారు 2 వేల ఏజెన్సీల నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన ఏజెన్సీల నియామకాలు రెండు విడతల్లో పూర్తి కానున్నాయని చెప్పారు. కాగా, ప్రస్తుతం దేశంలో 27 కోట్ల ఎల్‌పిజి వినియోగదారులున్నారు. ఇందులో 16.7 కోట్ల మంది వినియోగదారులు ఎల్‌పిజి కొనుగోళ్లను జరుపుతుండగా, మిగతా వినియోగదారుల కొనుగోళ్లు ఆగిపోయాయి. ఇదిలావుంటే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు 5 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లను ఇవ్వాలని చూస్తున్నామని ప్రధాన్ చెప్పారు.