బిజినెస్

మార్కెట్‌కు జిడిపి ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులపాటు లాభాల్లో నడిచిన సూచీలు ఈ వారం ట్రేడింగ్ చివరి రోజైన శుక్రవారం మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 284.56 పాయింట్లు క్షీణించి 25,519.22 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 82.40 పాయింట్లు కోల్పోయి 7,761.95 వద్ద నిలిచింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జిడిపి వృద్ధిరేటు అంచనా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. నిజానికి అంతకుముందు నాలుగు రోజుల్లో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెట్టాయ. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సుధీర్ఘకాలం తర్వాత వడ్డీరేటును పావు శాతం చొప్పున పెంచినప్పటికీ మార్కెట్లు లాభాల్లోనే నడిచాయ. అయతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) జిడిపి వృద్ధిరేటు అంచనాను కేంద్ర ప్రభుత్వం 8.1-8.5 శాతం నుంచి 7-7.5 శాతానికి తగ్గించడంతో మదుపరులలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. మెటల్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఆటో రంగాల షేర్ల విలువ 0.89 శాతం నుంచి 0.69 శాతం పడిపోయింది.