బిజినెస్

మార్కెట్‌లోకి డాట్సన్ ‘రెడీ-గో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: జపాన్ ఆటోరంగ దిగ్గజం నిస్సాన్.. మంగళవారం భారతీయ మార్కెట్‌కు డాట్సన్ ‘రెడీ-గో’ కారును పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 2.38 లక్షల రూపాయల నుంచి 3.34 లక్షల రూపాయల మధ్య ఉంది. దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ తదితర చిన్న కార్లకు పోటీగా డాట్సన్ బ్రాండ్‌లో నిస్సాన్ ఈ రెడీ-గోను ముందుకు తెచ్చింది. ఆల్టో-ఇయాన్ ధరల శ్రేణి 2.5 లక్షల రూపాయల నుంచి 4.42 లక్షల రూపాయల మధ్య ఉన్నది తెలిసిందే. ఇదిలావుంటే రెడీ-గో మోడల్.. భారత్‌లో డాట్సన్ బ్రాండ్‌లో నిస్సాన్ తెచ్చిన మూడో కారు. ఇకపోతే ఈ రెడీ-గో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా విలేఖరులకు తెలిపారు. 800సిసి ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చిన ఈ రెడీ-గో కారు లీటర్‌కు 25.17 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 15.9 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ చెప్పింది. కారు గరిష్ఠ వేగం గంటకు 140 కిలోమీటర్లు. దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్, డట్సన్ 274 ఔట్‌లెట్లలో ఈ కారు లభిస్తుంది.