బిజినెస్

లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐకి దాని అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకునేందుకు లైన్ క్లియరైంది. ఈ విలీనంతో ఎస్‌బిఐ అంతర్జాతీయ స్థాయి బ్యాంకుగా ఎదుగుతుందన్న విశ్వాసాన్ని ఎప్పట్నుంచో వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఆ దిశగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎస్‌బిఐకి అనుబంధంగా పనిచేస్తున్న ఐదు బ్యాంకుల విలీనానికి గ్రీన్‌సిగ్నల్ పడింది. గత నెల అనుబంధ బ్యాంకులతోపాటు కొత్తగా ఏర్పడిన భారతీ మహిళా బ్యాంకునూ విలీనం చేసుకుంటామని ఎస్‌బిఐ కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన చేసినది తెలిసిందే. దీనిపైనే తాజాగా ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఎస్‌బిఐకి అనుబంధంగా పనిచేస్తున్న బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్)తోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్ (ఎస్‌బిబిజె), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఉన్నాయి. తొలిసారిగా 2008లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, తర్వాత 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్.. ఎస్‌బిఐలో విలీనం అయ్యాయ. తాజాగా మిగతా అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఐదు అనుబంధ బ్యాంకులను తనలో కలిపేసుకునేందుకు ఓ నిబంధనావళిని ఎస్‌బిఐ సిద్ధం చేస్తున్నది తెలిసిందే. ఇందుకోసం 15-20 మంది సభ్యులతో కూడిన ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. కాగా, ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఎస్‌బిఐలో అనుబంధ బ్యాంకుల విలీనంపై మాట్లాడుతూ దీనివల్ల ఇరువైపులా లాభాలున్నాయన్నారు. ఎస్‌బిఐ ప్రవేశపెట్టే ప్రతి కొత్త టెక్నాలజీ.. అనుబంధ బ్యాంకుల ఖాతాదారులు ఇకపై అందుకోవచ్చన్నారు. ఇక టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. ఇదిలావుంటే అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత ఎస్‌బిఐ శాఖలు 22,500లకు పెరగన్నాయి. అలాగే ఎటిఎమ్‌ల సంఖ్య 58,000లకు, ఆస్తుల విలువ 37 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది. అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ స్టాక్ మార్కెట్లలో లిస్టయ ఉన్నాయి. ప్రస్తుత ఎస్‌బిఐకి సుమారు 16,500ల శాఖలుండగా, ఇందులో 191 విదేశాల్లో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం దేశంలో మొత్తం 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను కలవరపెడుతున్న మొండి బకాయిలు కూడా బ్యాంకుల ఏకీకృతానికి దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 12 బ్యాంకులు 22 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టాలను నమోదు చేయగా, వీటికి కారణం మొండి బకాయిలే. దీంతో బ్యాంకులు ఒక్కటైతే మొండి బకాయిల సమస్య తీరుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఒక బ్యాంకులో రుణం తీసుకుని ఎగ్గొట్టి, మరో బ్యాంకులో రుణం తీసుకుంటున్నారని, బ్యాంకులు తగ్గితే ఈ అవకాశం ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది సర్కారు. అయతే అనుబంధ బ్యాంకులు మాత్రం విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాయ. సమ్మెలతో తమ నిరసనను వ్యక్తం చేస్తు న్నాయ. ఎస్‌బిటికి మద్దతుగా కేరళ ప్రభుత్వం తమ గొంతు వినిపించింది.
ఎస్‌బిఐ, అనుబంధ బ్యాంకుల
షేర్లకు డిమాండ్
ముంబయి: మరోవైపు కేబినెట్ ఆమోదం నేపథ్యంలో ఎస్‌బిఐ, దాని అనుబంధ బ్యాంకుల షేర్లకు బుధవారం ట్రేడింగ్‌లో పెద్ద ఎత్తున కొనుగోళ్ల మద్దతు లభించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ షేర్ విలువ 20 శాతం పెరిగి 547.90 రూపాయలుగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ షేర్ విలువ 19.99 శాతం ఎగిసి 478.90 రూపాయలుగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్ షేర్ విలువ కూడా 19.99 శాతం పెరిగి 599.60 రూపాయలకు చేరింది. ఇక వీటి మాతృ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) షేర్ విలువ కూడా 3.90 శాతం పెరిగి 215.65 రూపాయలను తాకింది.

బ్యాంక్ ఆఫ్ కలకత్తా నుంచి జన్మించిన ఎస్‌బిఐ.. జూన్ 2, 1806లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్‌గా అవతరించింది. అనంతరం బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌లతో కలిసి జనవరి 27, 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. భారత స్వాతంత్య్రానంతరం జూలై 1, 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది. జూన్ 2, 1956లో జాతీయమైంది.
210 సంవత్సరాల చరిత్ర కలిగిన
ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం ముంబయలో ఉంది