బిజినెస్

75 వేల కోట్లకు చేరిన ఐటి ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15 : ఐటి, ఐటి అనుబం ధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. గత 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటి, ఐటి అనుబంధ వార్షిక నివేదికను ఇక్కడ (బేగంపేటలోని టూరిజం ప్లాజా) బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఐటి, ఐటి అనుబంధ రంగాల వృద్ధిరేటు 12.30 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం 13.26 శాతం నమోదైందన్నారు. 2015-16లో 35,611 మంది నిపుణులకు ఉద్యోగాలు లభించాయని, దాంతో ఈ రంగంలో ఉద్యోగం చేస్తున్న ఐటి నిపుణుల సంఖ్య 4,07,385కి చేరిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వ్యాపార అనుకూల విధానం, వౌలిక సదుపాయాల కల్పనలో అత్యున్నత ప్రమాణాలను పాటించడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం, టాస్క్, టి-హబ్ తదితర సంస్థలు ఏర్పాటు కావడం తదితర అం శాలు ఐటి, ఐటి అనుబంధ రంగం పురోభివృద్ధికి మూలకారణాలుగా పేర్కొన్నారు. కాగా, ఐసిటి పాలసీ వల్ల తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా మారిందని ఐటి కార్యదర్శి జయేశ్‌రంజన్ పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఐటి రంగంలో తెలంగాణ ముందుకు దూసుకుపోతోందన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖలు ఐసిటిని ఉపయోగించుకుని పరిపాలనను మెరుగుపరచుకోవడానికి అవకాశం ఇచ్చామన్నారు.

చిత్రం... తెలంగాణ ఐటి, ఐటి అనుబంధ రంగాల వార్షిక నివేదికను విడుదల చేస్తున్న కెటిఆర్

ఆరు అంతర్జాతీయ ఒప్పందాలకు ఆమోదం
న్యూఢిల్లీ, జూన్ 15: ఆరు అంతర్జాతీయ ఒప్పందాలకు బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం పలికింది. వీటిలో తైవాన్‌తో విమానయాన సంబంధాలు పెంచుకోవడం, సముద్ర గర్భంలో దాగి ఉన్న అపురూపమైన, విలువైన ఖనిజాల అనే్వషణ దిశగా ఇతర దేశాలతో భారత్ కలిసి వెళ్లడం వంటివి ఉన్నాయి. సముద్ర గర్భంలోని ఖనిజ సంపద వెలికితీతలో ప్రస్తుతం చైనా, కొరియా, జర్మనీ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇక్కడ సమావేశమైన కేబినెట్ శాస్త్ర, సాంకేతిక, విమానయాన, కార్మిక రంగాల్లో వివిధ దేశాలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకునేందుకూ అంగీకరించింది.

ప్రైవేటీకరణపై భగ్గుమన్న వాణిజ్య సంఘాలు
న్యూఢిల్లీ, జూన్ 15: ఎయిరిండియా, మరో 28 ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనపై ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలోని బిఎమ్‌ఎస్‌సహా వాణిజ్య, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. ప్రభుత్వరంగంలోని ఖాయిలా పరిశ్రమలను, నష్టాల్లో నడుస్తున్న సంస్థలను మూసివేయాలని, దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతుందని అభిప్రాయపడుతూ ప్రధాన మంత్రి కార్యాలయానికి నీతి ఆయోగ్ నివేదికను సమర్పించింది.