బిజినెస్

కోలుకున్న చమురేతర రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: గతకొంత కాలంగా క్షీణిస్తున్న దేశీయ ఎగుమతులు చమురేతర రంగాల చలవతో తిరిగి కోలుకుంటున్న సంకేతాలు కనిపించాయి. దీంతో గత నెల ఎగుమతులు స్వల్వ తగ్గుదలకే పరిమితమయ్యాయి. నిరుడుతో పోల్చితే ఈ మే నెలలో 0.79 శాతం పడిపోయి 22.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 13.16 శాతం తగ్గి 28.44 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 6.27 బిలియన్ డాలర్లుగా ఉంది. నిరుడు ఇది 10.4 బిలియన్ డాలర్లుగా ఉందని బుధవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో భారత ఎగుమతులు 3.74 శాతం దిగజారి 42.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా, ఎగుమతుల సంఘం ఎఫ్‌ఐఇఒ.. తాజా గణాంకాలపై స్పందిస్తూ చమురేతర ఎగుమతులు చాలాకాలం తర్వాత కోలుకున్నాయని అందుకే దేశీయ ఎగుమతులు పెరిగాయంది. గత నెల బంగారం దిగుమతులు 39 శాతం తగ్గి 1.47 బిలియన్ డాలర్లుగా నిలిచాయి.

హడ్కో వాటా విక్రయానికి ప్రభుత్వ ఆమోదం

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రభుత్వరంగ సంస్థ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో)లో 10 శాతం వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సిసిఇఎ) వాటా అమ్మకానికి అనుమతిచ్చింది. ఈ మేరకు బుధవారం ఓ అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. వాటా అమ్మకంలో హడ్కో ఉద్యోగులకు, రిటైల్ ఇనె్వస్టర్లకు షేర్ ధరపై 5 శాతం వరకు రాయితీ ఇవ్వాలన్నదానికీ సిసిఇఎ అంగీకరించింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో ప్రభుత్వరంగ సంస్థల నుంచి వాటా అమ్మకాల ద్వారా 56,500 కోట్ల రూపాయలను ఖజానాకు తరలించాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది తెలిసిందే. ఇందులో 36,000 కోట్ల రూపాయలు మైనారిటీ వాటా విక్రయం ద్వారా వచ్చే ఆదాయమైతే, మిగతా 20,500 కోట్ల రూపాయలు వ్యూహాత్మక విక్రయం నుంచి వచ్చే ఆదాయం. 2016-17లో భాగంగా ఇప్పటికే ఎన్‌హెచ్‌పిసిలో వాటా అమ్మకం ద్వారా 2,700 కోట్ల రూపాయల నిధులను అందుకున్న కేంద్రం.. ఇప్పుడు హడ్కోలో వాటాను అమ్మకానికి తెస్తోంది. ప్రస్తుతం ఒక్కో హడ్కో షేర్ విలువ 10 రూపాయలుగా ఉంది. మరోవైపు కార్మిక సహకారంపై భారత్-సౌదీ అరేబియా మధ్య ఒప్పందానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల భారతీయ వలస కార్మికులకు లాభించనుంది. ఇకపోతే పంజాబ్‌లో 2,070 కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టుకూ కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులతో ఐదో నెంబర్ జాతీయ రహదారిపై 54 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారిని, 22 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారిని నిర్మించనున్నారు. కాగా, ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల వసూళ్లకు వీలుగా డెట్ రికవరీ సవరణను కోరుతూ ఓ బిల్లును కూడా ఈ సందర్భంగా కేబినెట్ ఆమోదించింది.