బిజినెస్

ఎఫ్‌పిఐలలో పెట్టుబడుల ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 4,400 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలోకి 32,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు పట్టుకొచ్చారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు మదుపరులను విపరీతంగా ఆకట్టుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఏప్రిల్‌లో జరిపిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును ఐదేళ్ల కనిష్టానికి తగ్గిస్తూ 6.5 శాతానికి తీసుకురావడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. కాగా, అంతకుముందు రెండు నెలలతో పోల్చితే మే నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మాత్రం తక్కువే. 2,543 కోట్ల రూపా యల పెట్టుబడులు మాత్రమే గత నెల భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. మరోవైపు ఇదే సమయంలో రుణ మార్కెట్ల నుంచి 4,409 కోట్ల రూపాయల విలువైన విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ జరగడం గమనార్హం. ఇక ఈ నెల ఆరంభం నుంచి 16 వరకు 4,394 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి తెచ్చారు. అంతకుముందు నెలల్లో మాదిరిగానే రుణ మార్కెట్ల నుంచి ఈ నెలలోనూ ఇప్పటిదాకా 1,607 కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు వెనక్కి తీసుకున్నారు. దీంతో నికర విదేశీ పెట్టబడుల విలువ 2,787 కోట్ల రూపాయలుగానే ఉంది. కాగా, జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 19,848 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే రుణ మార్కెట్ల నుంచి 6,955 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 12,893 కోట్ల రూపాయలుగా నమోదైంది.