బిజినెస్

కొత్తగా వచ్చేవారూ ద్రవ్యోల్బణంపై పోరాడతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 20: తన తర్వాత వచ్చేవారు ద్రవ్యోల్బణంపై పోరును కొనసాగించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్. ఈ ఏడాది సెప్టెంబర్ 4తో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగుస్తుండగా, రెండోసారి ఈ పదవిలో కొనసాగడం ఇష్టం లేదని గత శనివారం ప్రకటించినది తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఇక్కడ టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్‌లో ‘ద్రవ్యోల్బణంపై పోరు: మన సంస్థాగత అభివృద్ధికి ప్రధానం’ అన్న అంశంపై ఉపన్యాసం చేశారు రాజన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌బిఐ గవర్నర్‌గా గత మూడేళ్ల నుంచి ద్రవ్యోల్బణం గణాంకాలను రెండంకెల స్థాయి నుంచి తగ్గించేందుకు పోరాడినట్లు తెలిపారు. కొత్త గవర్నర్లు కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంపై ప్రధాన దృష్టిని పెట్టాలని ఆకాంక్షించారు. ద్రవ్యోల్బణంపై పోరులో మానిటరీ పాలసీ కమిటీ (ఎమ్‌పిసి) ఓ విప్లవాత్మక అడుగుగా అభివర్ణించారు. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ వ్యవహారంపై స్పందిస్తూ ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లలో నెలకొనే ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

తెలంగాణలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు
న్యూఢిల్లీ, జూన్ 20: తెలంగాణలో 100 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టును సిఎల్‌పి ఇండియా, సుజ్లాన్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని వెల్తూర్ వద్ద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుండగా, ఎస్‌ఇ సోలార్ పేరిట ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్‌లో సిఎల్‌పి ఇండియాకు 49 శాతం వాటా ఉంది. ఈ మేరకు గత వారం ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. కాగా, హాంకాంగ్‌కు చెందిన విద్యుత్ సంస్థ అయిన సిఎల్‌పి ఇండియా.. భవిష్యత్తులో ఈ జాయింట్ వెంచర్‌ను పూర్తిగా సొంతం చేసుకునేందుకూ అవకాశం ఉంది.

నిధుల వేటలో ఆంధ్రా బ్యాంక్
బాండ్ల ద్వారా వెయ్యి కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ, జూన్ 20: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్.. బాండ్ల ద్వారా 1,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది. ఈ నెల 22 నుంచి 27 వరకు సబ్‌స్క్రిప్షన్ తెరిచి ఉంటుందని సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఆంధ్రా బ్యాంక్ తెలియజేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం ఈ నిధులను వెచ్చిస్తామని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.