బిజినెస్

పెట్టుబడులు, ఉపాధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు దేశంలో పెట్టుబడుల అవకాశాలను పెంచుతుందని, ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల రాకకు దోహదం చేస్తుందని భారత పారిశ్రామిక, వ్యాపార ప్రపంచం కొనియాడింది. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పనకు కూడా కలిసొస్తుందని అభిప్రాయపడింది.
‘ఎఫ్‌డిఐ నిబంధనల సరళీకరణ.. సంస్కరణలపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అంతేగాక దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి చర్యలు చేపడుతున్నామన్న ప్రభుత్వ వాదనకు తాజా నిర్ణయాలు బలం చేకూరుస్తున్నాయి.’ అని పారిశ్రామిక సంఘం సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఏర్పడిందన్నారు. ఆహార తయారీ, రక్షణ, ఔషధ, పౌర విమానయానం, సింగిల్ బ్రాండ్ రిటైల్ తదితర కీలక రంగాల్లోకి ఇక పెట్టుబడులు పోటెత్తుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సంస్కరణలు కొనసాగుతున్నాయన్నది మరోసారి స్పష్టమైందని ఫిక్కీ ప్రధాన కార్యదర్శి ఎ దిదార్ సింగ్ అన్నారు. ముఖ్యంగా రక్షణ, విమానయానం వంటి వ్యూహాత్మక రంగాల్లో ఎఫ్‌డిఐ విధానాన్ని సరళతరం చేయడం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు.
అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ స్పందిస్తూ రక్షణ రంగంలో సాంకేతికాభివృద్ధికి తాజా నిర్ణయాలు ఎంతో ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇక ఔషధ రంగంలోకి ఆటోమెటిక్ మార్గం ద్వారా 74 శాతం వరకు ఎఫ్‌డిఐని కేంద్ర ప్రభుత్వం అనుమతించడాన్ని భారత ఔషధ ఉత్పత్తిదారుల సంస్థ (ఒపిపిఐ) స్వాగతించింది.
దేశంలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఇది కృషి చేస్తుందని ఒపిపిఐ డైరెక్టర్ జనరల్ కాంచన టికె సోమవారం పిటిఐకి తెలిపారు. బహుళజాతి సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు వస్తాయని, ఇది దేశీయ పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచుతుందని ఏంజెల్ బ్రోకింగ్ ఫార్మా రిసెర్చ్ విపి సరబ్‌జిత్ కౌర్ నంగారా అన్నారు. విదేశీ పెట్టుబడులు దేశంలోకి అధికంగా వస్తే అన్నివిధాల ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

నిస్తేజాన్ని తొలగిస్తేనే నిలకడైన వృద్ధిరేటు

కీలక రంగాలను ఉత్తేజపరచాలి ౄ భారత్‌కు ప్రపంచ బ్యాంక్ సూచన

న్యూఢిల్లీ, జూన్ 20: రాబోయే ఏళ్లలో జిడిపి వృద్ధిరేటు నిలకడగా 7.6 శాతంగా కొనసాగాలంటే నిస్తేజంలో ఉన్న కీలక రంగాలను భారత్ తిరిగి ఉత్తేజపరచాలని ప్రపంచ బ్యాంక్ సూచించింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు వేగంగా పెరిగిందని సోమవారం ఇక్కడ విడుదలైన ఓ నివేదికలో పేర్కొంది. రెండేళ్లకోసారి విడుదల చేసే ఈ నివేదికలో ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) కూడా నిరుడు మాదిరి 7.6 శాతం వృద్ధిరేటు తగ్గకూడదంటే గ్రామీణ వినియోగం, ప్రైవేట్‌రంగ పెట్టుబడులు, ఎగుమతులు పుంజుకోవాలని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.7 శాతంగా, ఆపై ఆర్థిక సంవత్సరం (2018-19)లో 7.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఇదిలావుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్.. మూడేళ్ల పదవీకాలం ముగుస్తున్న క్రమంలో ఆయన తీసుకొచ్చిన బ్యాంకింగ్ సంస్కరణలను కొనసాగించితే మంచిదని విలేఖరులతో భారత్‌లో ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ ఒన్నో రుల్ వ్యాఖ్యానించారు.