బిజినెస్

వెంటాడిన బ్రెగ్జిట్ భయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. మంగళవారం సూచీలు నష్టపోయినది తెలిసిందే. గురువారం బ్రెగ్జిట్‌పై రెఫరెండం జరుగుతున్న క్రమంలో మదుపరులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 47.13 పాయింట్లు కోల్పోయి 26,765.65 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 16.20 పాయింట్లు పడిపోయి 8,203.70 వద్ద నిలిచింది. ఇండస్ట్రియల్స్, ఆటో, టెలికామ్, యుటిలిటీస్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్ల విలువ 0.79 శాతం నుంచి 0.57 శాతం వరకు దిగజారగా, హెల్త్‌కేర్, రియల్టీ, లోహ రంగాల షేర్ల విలువ 0.42 శాతం నుంచి 0.02 శాతం మేర పెరిగాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్ సూచీలు లాభపడగా, జపాన్ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు లాభపడ్డాయి.

రేపటి నుంచి ఎయిర్ ఆసియా
ట్రావెల్ ప్రదర్శన

హైదరాబాద్, జూన్ 22: శుక్రవారం నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు ట్రావెల్ ప్రదర్శన ఇక్కడ ఇనార్బిట్ హాల్‌లో జరుగుతుందని ఎయిర్ ఆసియా తెలిపింది. ఈ ప్రదర్శనను తిలకించినవారు జులై 12 నుంచి నవంబర్ 18 మధ్య విమాన ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకుంటే విమాన టిక్కెట్లలో డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని ఆ సంస్థ బుధవారం తెలిపింది. ట్రావెల్ ఫెయిర్‌లో ఎయిర్ ఆసియా ప్రతినిధులు ఉంటారని చెప్పింది.

కెమెటల్‌ను కొనేస్తున్న బిఎఎస్‌ఎఫ్

న్యూఢిల్లీ, జూన్ 22: స్పెషాలిటి కెమికల్స్ సంస్థ కెమెటల్‌ను 3.2 బిలియన్ డాలర్లకు తమ మాతృ సంస్థ కొనుగోలు చేయడానికి ఓ ఒప్పందం కుదుర్చుకుందని కెమికల్ సంస్థ బిఎఎస్‌ఎఫ్ ఇండియా తెలిపింది. జర్మనీకి చెందిన కెమెటల్.. మెటల్స్, ప్లాస్టిక్స్ రంగాల్లో వినియోగించే స్పెషాలిటి కెమికల్స్‌ను సరఫరా చేస్తుంది. 20కిపైగా దేశాల్లో 21 ఉత్పాదక కేంద్రాలున్న కెమెటల్ సంస్థలో 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత్‌లో కెమెటల్‌కు దాదాపు 150 మంది ఉద్యోగులున్నారు. కాగా, గత సంవత్సరం ఈ సంస్థ భారతీయ టర్నోవర్ 24 మిలియన్ డాలర్లుగా ఉంది. కెమెటల్ తయారుచేసే రసాయనాలను ఆటోమోటివ్, ఏరోస్పేస్, కాయిల్, లోహ రంగాల్లో వినియోగిస్తున్నారు. ఇదిలావుంటే ఈ ఏడాది ఆఖర్లోగా కెమెటల్ కొనుగోలు ప్రక్రియ ముగియవచ్చని బిఎఎస్‌ఎఫ్ ఇండియా రెగ్యులేటరీకి తెలియజేసింది. కెమెటల్ ఉత్పత్తులు.. బిఎఎస్‌ఎఫ్ వ్యాపార విస్తరణకు దోహదపడతాయని, తమ ఉత్పత్తుల విభాగాన్ని పెంచుతుందని బిఎఎస్‌ఎఫ్ ఇండియా తెలిపింది.