బిజినెస్

జాప్యం వద్దు.. రేపే ప్రారంభించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, జూన్ 26: ఐరోపా యూనియన్‌నుంచి నిష్క్రమించే అధికారిక ప్రక్రియను ఈ వారంలోనే ప్రారంభించాలని యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షుడు బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్‌ను కోరారు. యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలిగితే మరింత అనిశ్చితి తలెత్తుతుందని, ఫలితంగా ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయనే భయాలు తలెత్తే కాలం పోయిందని మార్టిన్ షుల్జ్ ప్రముఖ జర్మనీ వార్తాపత్రిక ‘బిల్డ్‌యామ్ సోన్‌టాగ్’తో అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడే తన పని ప్రారంభిస్తుందని తామంతా అనుకుంటున్నామని ఆయన అంటూ, మంగళవారం జరిగే సమావేశమే దానికి సరయిన సమయమని అన్నారు. యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ నిష్క్రమణ ప్రక్రియ మంగళవారమే ప్రారంభం అయ్యేలా చూడాలని కామెరాన్‌ను కోరే ఒక ముసాయిదా తీర్మానాన్ని సైతం ఈయులోని నాలుగు పెద్ద గ్రూపులు సిద్ధం చేశాయి. అనిశ్చితి లేకుండా చూడడానికి, యూరోపియన్ యూనియన్ సమగ్రతను కాపాడడానికి ఇది అవసరమని ఆ గ్రూపులు అంటున్నాయి. ఈయునుంచి బ్రిటన్ వైదొలగాలంటూ రెఫరెండం తీర్పు వచ్చిన దృష్ట్యా అక్టోబర్‌నాటికల్లా తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని, ఈయునుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను కొత్త ప్రధానికి వదిలిపెడతానని ప్రధాని డేవిడ్ కామెరాన్ శుక్రవారం చెప్పడం తెలిసిందే. ఈయునుంచి వైదొలిగే ప్రక్రియను ప్రారంభించడానికి బ్రిటన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఉపయోగించని యూరోపియన్ యూనియన్‌కు చెందిన లిస్బన్ ఒప్పందంలోని 50వ అధికరణాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. దానికన్నా ముందు తాను ఇయునుంచి వైదొలగుతున్నట్లు యూరోపియన్ కౌన్సిల్ సభ్య దేశాలన్నిటికీ తెలియజేయాలి. కాగా, ఈయునుంచి బ్రిటన్ వైదొలగడం వల్ల తలెత్తే పరిణామాలను చర్చించడానికి ఈయు మంగళ, బుధవారాల్లో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తోంది. ఈయు పార్లమెంటు కూడా ప్రత్యేక సమావేశం జరుపుతోంది.
రెండో రెఫరెండం పిటిషన్‌పై 30 లక్షలకుపైగా సంతకాలు
లండన్: ఈయునుంచి వైదొలగాలన్న బ్రిటన్ నిర్ణయంపై రెండో రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేసే ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాల సంఖ్య ఆదివారం నాటికి 30 లక్షలను దాటిపోయింది. కేవలం 48 గంటల్లోనే ఇన్ని సంతకాలు రావడాన్ని బట్టి ఈయునుంచి బ్రిటన్ వైదొలగడానికి అనుకూలంగా వచ్చిన ఫలితం బ్రిటిషర్లను ఎంతగా షాక్‌కు గురి చేసిందో అర్థమవుతుంది. బ్రిటన్ పార్లమెంటు అధికారిక వెబ్‌సైట్‌లోని పిటిషన్‌పై సంతకాల సంఖ్య ఆదివారం ఉదయానికి 30,48,000కు చేరుకుంది. మంగళవారం కామన్స్ సభ పిటిషన్ల సెలెక్ట్ కమిటీ దీనిపై చర్చిస్తుందని కన్సర్వేటివ్ పార్టీ ఎంపి బెన్ హౌలెట్ చెప్పారు కూడా. కాగా, ఈయునుంచి బ్రిటన్ వైదొలగడానికి అనుకూలంగా ఓటేసిన చాలామంది ఇప్పుడు అవకాశం లభిస్తే తమ నిర్ణయాన్ని మార్చుకుంటామని చెప్తుండడం గమనార్హం.