బిజినెస్

సిఆర్‌సీసీతో ఏపి సర్కారు చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: చైనా రైల్వే కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (సీఆర్‌సీసీ) ప్రధాన ఆర్థికవేత్త ఝావో జినుహ ఆధ్యర్వంలోని ఒక బృందంతో ఏపి ప్రభుత్వం పరస్పర సహకారంపై చర్చలు జరిపింది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, శాస్త్ర సాంకేతికశాఖ సహాయ మంత్రి సుజనా చౌదరిలు ఈ బృందంతో ఏపిభవన్‌లోని గురజాడ మందిరంలో భేటి అయ్యారు.
ఏపిలో సమగ్ర నీటి నిర్వహణ చేపట్టాలనుకుంటున్నామని అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు ఈ సందర్భంగా బృందానికి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాలకు నిరంతర నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని వివరించారు.
వ్యవసాయం, పరిశ్రమలు, జల రవాణాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దీనికి ఈ బృందం స్పందిస్తూ సరికొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగం పంచుకునేందుకు ఆసక్తితో ఉన్నామని, త్వరలోనే కార్యచరణ ప్రణాళికతో ముందుకు వస్తామని వివరించింది. తద్వారా భారీ పెట్టుబడు లకు సంకేతాలిచ్చింది.

కృష్ణపట్నం ఓడరేవుకు
సిఐఐ అవార్డు

ముత్తుకూరు, జూలై 12: పారిశ్రామిక సంఘం సిఐఐ నుండి కృష్ణపట్నం ఓడరేవు ఫోర్‌స్టార్ అవార్డును అందుకుంది. ఈ అవార్డును ఓడరేవు ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎన్ జితేంద్ర తీసుకున్నారు. ఈ అవార్డుతోపాటు ఇన్‌ప్లాంజ్ స్టెచర్ పురస్కార్ అవార్డును కూడా ఓడరేవు అందుకుంది. ఈ విషయాన్ని పోర్టు ఉన్నతాధికారులు మంగళవారం విలేఖరులకు తెలియజేశారు. ఆరోగ్యం, భద్రత, పర్యావరణం అనే అంశాలపై చెన్నై లో రెండు రోజుల క్రితం సిఐఐ సదస్సును నిర్వహించగా, 2015- 16కుగాను పోర్టు ప్రతిభను గుర్తిం చి ఈ అవార్డును అందజేసింది.