బిజినెస్

కెన్యాతో అపోలో ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: కెన్యట్టా నేషనల్ హాస్పిటల్, ఎయిర్‌టెల్ కెన్యాతో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ రెండు అవగాహన ఒప్పందాల (ఎమ్‌ఒయు)ను కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం ఇక్కడ అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన ఓ ప్రకటన తెలియజేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి ఆఫ్రికా దేశాల పర్యటనలో పాల్గొన్న భారత వ్యాపార బృందంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి కూడా ఉండగా, నైరోబీలో ఈ ఎమ్‌ఒయులు కుదిరాయి. దీంతో భారత్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో కెన్యా వైద్యులకు, అక్కడి ఇతర వైద్యరంగ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.