బిజినెస్

పి-నోట్ల మెచ్యూరిటీలకు ‘గార్’ అమలు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: జనరల్ యాంటి అవాయిడెన్స్ రూల్స్ (గార్) నుంచి పి-నోట్ మెచ్యూరిటీలకు తప్పక మినహాయింపు ఇవ్వాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ డిమాండ్ చేసింది. పార్టిసిపేటరీ నోట్ల మెచ్యూరిటీపై విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ)కు గార్‌ను అమలు చేయవద్దని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ అన్నారు. పి-నోట్లకు గార్ నిబంధనల అమలుతో పెట్టుబడులకు విఘాతమని ఆయన అభిప్రాయపడ్డారు. 2012-13 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో గార్‌ను కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిచయం చేసింది. ఇది 2014 ఏప్రిల్ 1 నుంచి అమలు కావాల్సి ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నారు.

తాజ్ బోస్టన్‌ను అమ్మేసిన
ఇండియన్ హోటల్స్

న్యూఢిల్లీ, జూలై 13: టాటా గ్రూప్ హాస్పిటాలిటీ విభాగం, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌ను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ సంస్థ.. తాజ్ బోస్టన్ హోటల్‌ను 125 మిలియన్ డాలర్ల (839 కోట్ల రూపాయలు)కు విక్రయించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సిఎల్) తెలియజేసింది. 2006లో తాజ్ బోస్టన్ హోటల్‌ను ఐహెచ్‌సిఎల్ సొంతం చేసుకుంది. అమెరికాలో తాజ్ బ్రాండ్‌కు ఇది చిహ్నంగా వెలిగింది. అయితే దీన్నిప్పుడు ఎఎస్ హోల్డింగ్ ఎల్‌ఎల్‌సికి అమ్మేసింది.