బిజినెస్

పెరిగిన పత్తి ధర క్వింటాల్ రూ. 6,800

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని టౌన్, జూలై 15: రాయలసీమలో పత్తి మార్కెట్‌కు పేరుగాంచిన కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి ధర భారీగా పెరిగింది. క్వింటాల్ పత్తి ధర రూ. 6,800కు చేరినట్లు మార్కెట్ యార్డు గ్రేడ్-1 కార్యదర్శి రామారావు తెలిపారు. గత వారం క్వింటాల్ రూ. 6,300 పలికిన ధర వారం రోజుల్లోనే రూ. 500 పెరిగి రికార్డు స్థాయికి చేరిందన్నారు. కాగా, శుక్రవారం మార్కెట్ యార్డుకు సుమారు 900 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. గరిష్ఠంగా క్వింటాల్ ధర రూ. 6,800 పలకగా, కనిష్టంగా రూ. 4,807, మధ్యస్తంగా రూ. 6,352 పలికినట్లు వివరించారు. గత వారం గరిష్ఠ ధర రూ. 6,305 అవగా, కనిష్ట ధర రూ. 4,575గా నమోదైంది. వారం ప్రారంభం నుంచే పత్తి ధర రోజురోజుకు పెరుగుతూ వచ్చిందన్నారు. పత్తి చెక్కుల నిల్వలు ఎక్కువగా లేకపోవడం, విదేశాలకు పత్తి బేళ్ల ఎగుమతులు పెరగడంతో ధర కూడా పెరుగుతూ వచ్చిందన్నారు. మరోవైపు రెండు నెలల క్రితం రూ. 5 వేల లోపు ఉన్న ధర అమాంతం రూ. 1,800 పెరిగి రూ. 6,800కు చేరుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా వేరుశెనగ ధర గత వారంతో పోల్చితే భారీగా పెరిగిందని కార్యదర్శి వివరించారు. గత వారం క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ. 4,038 పలకగా ఈ వారం రూ. 6,300కు చేరిందన్నారు. అందుబాటులో వేరుశెగన నిల్వలు లేకపోవడంతోనే ధర పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు.