బిజినెస్

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: దేశ ఎగుమతులు సుధీర్ఘకాలం తర్వాత పుంజుకున్న సంకేతాలనిచ్చాయి. 18 నెలల తర్వాత గత నెల జూన్‌లో 1.27 శాతం వృద్ధిరేటు నమోదైంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు పెరిగాయి. దీంతో 22.57 బిలియన్ డాలర్లుగా భారత ఎగుమతులు నమోదయ్యాయి. నిరుడు ఇదే నెల 22.28 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు కూడా 8.11 బిలియన్ డాలర్లకు వచ్చింది. క్రిందటిసారి 10.82 బిలియన్ డాలర్లుగా ఉంది. 2014 డిసెంబర్ నుంచి దేశ ఎగుమతులు క్రమేణా క్షీణిస్తున్నది తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పతనం మధ్య పడిపోయిన డిమాండ్ భారత ఎగుమతులను ప్రభావితం చేసింది. ఇకపోతే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం గత నెలలో దేశంలోకి విదేశాల నుంచి జరిగిన దిగుమతుల విలువ 30.68 బిలియన్ డాలర్లుగా ఉంది. నిరుడు జూన్‌లో ఇది 33.11 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇప్పుడు 7.33 శాతం తగ్గింది. ముఖ్యంగా బంగారం దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. నిరుడుతో పోల్చితే 38.54 శాతం తగ్గి 1.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. నాడు 1.96 బిలియన్ డాలర్లుగా పసిడి దిగుమతులు ఉన్నాయి. కాగా, ఎగుమతిదారుల సంఘం ఎఫ్‌ఐఇఒ అధ్యక్షుడు ఎస్‌సి రల్హన్ తాజా గణాంకాలపై స్పందిస్తూ ఎగుమతిదారుల్లో నూతనోత్సాహాన్ని రేకెత్తించాయన్నారు. పారిశ్రామిక సంఘం సిఐఐ మాట్లాడుతూ భారత ఎగుమతిదారుల్లో అడుగంటిన విశ్వాసాన్ని మరింత పెంపొందించడానికి ఇలాంటి వృద్ధి చాలా అవసరమంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మాట్లాడుతూ ఇక ఎగుమతులు పుంజుకుంటాయని, క్షీణతకు బ్రేకులు పడ్డట్లే అని వ్యాఖ్యానించినది తెలిసిందే. ఇదిలావుంటే ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ ఎగుమతులు 65.31 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నిరుడు 66. 69 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు ఈసారి 84.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్యలోటు 19.23 బిలియన్ డాలర్లుగా ఉంది.