బిజినెస్

వ్యవసాయానికి సెర్చ్ ఇంజన్‌గా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వృద్ధి తగ్గుదల కారణంగా, భారత ప్రభుత్వం 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో రాష్ట్రాలకు సహాయం చేసేందుకు, వ్యవసాయ, తత్సంబంధ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధి సాధించటానికి దీన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ అభివృద్ధి వ్యూహాలను రైతుల అవసరాలకు సరిపోయేలా నవీకరించాలన్నది దీని ఉద్దేశం. ప్రస్తుతం వ్యవసాయ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ సంప్రదింపులతో, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి మార్గదర్శకాలు అమలు పరుస్తున్నారు. ఈ పథకానికి (ఆర్‌కేవీవై) అవసరమైన నిధులు 100 శాతం గ్రాంట్‌గా కేంద్ర ప్రభుత్వమే 2014-15 ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్రాలకు అందించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో నిధులు మంజూరు చేస్తున్నా య. 2015-16లో ఆర్‌కేవీవై పథకం కింద వ్యవసాయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యానవన శాఖ, ఉద్యాన విశ్వవిద్యాలయం, పశు సంవర్ధక శాఖ, పశు సంవర్ధక విశ్వ విద్యాలయం, మత్స్య శాఖ, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, రైతుబజార్, సన్నకారు రైతుల వ్యవసాయం, అడవుల సంరక్షణ శాఖ, సుగంధ ద్రవ్యాల బోర్డు, ఏపి మార్క్‌ఫెడ్, ఇక్రిసాట్, ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థలకు దీని ద్వారా నిధులు అందాయి. 2015-16లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు 312.52 కోట్లు, 2014-15లో మంజూరు చేసిన నిధులు 187.51 కోట్లు కాగా, ఇందులో ఉప పథకాల కింద 10.28 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 197.79 కోట్లు. ఇక రాష్ట్ర వాటాగా ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన నిధులు 128.44 కోట్లు. ఈ మొత్తం అన్ని రంగాలకు విడుదల చేశారు. 2015-16 సంవత్సరంలో వేర్వేరు రంగాల్లో వివిధ ప్రాజెక్టుల అమలుకు ఖర్చయిన నిధులు 118.11 కోట్లు. మిగిలిన 20.69 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం తిరిగి మంజూరు చేసింది. వాటిని 2016-17 సంవత్సరంలో ఉపయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి కోరింది. ఇక కేంద్రం 182.30 కోట్లు వివిధ శాఖలకు మంజూరు చేసింది.
2016-17వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయ తత్సంబంధిత రంగాలకు ప్రాజెక్టుల నిర్వహణకుగాను 220.71 కోట్ల నిధులు మధ్యంతరంగా విడుదల చేయాలని సూచించింది. కాగా, కేంద్రం నుంచి 2016-17 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి 367.85 కోట్లు మంజూరయ్యాయి. 2016-17 సంవత్సరంలో ఆర్‌కెవివై ద్వారా తాత్కాలిక కేటాయింపులు జరిగాయి. వ్యవసాయ శాఖకు 119.55 కోట్లు, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 16.11 కోట్లు, ఆగ్రి బయోటెక్ ఫౌండేషన్‌కు 1.50 కోట్లు, ఫుడ్ అండ్ ఆగ్రి బిజినెస్ స్కూల్‌కు 2.40 కోట్లు, ఉద్యానవన శాఖకు 78.86 కోట్లు, డా. వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయానికి 10.87 కోట్లు, పశు సంవర్థక శాఖకు 20.42 కోట్లు, ఏపి పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థకు 22.60 కోట్లు, మత్స్య శాఖకు 37.65 కోట్లు, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వ విద్యాలయానికి 10.89 కోట్లు, పట్టు పరిశ్రమకు 15.81 కోట్లు, ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి 11.71 కోట్లు, ఎస్‌ఎఫ్‌ఎసికు 2.40 కోట్లు, ఏపి మార్క్‌ఫెడ్‌కు 5.42 కోట్లు, అటవీ సంరక్షణ శాఖకు 11.66 కోట్ల కేటాయింపులు జరిగాయి.