బిజినెస్

వికసించని విప్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 19: దేశీయ ఐటి రంగంలో మూడో అతిపెద్ద సంస్థ అయిన విప్రో ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను మంగళవారం ఇక్కడ విప్రో ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 2,052 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 2,192 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. దీంతో ఈసారి లాభాలు 6.3 శాతం పడిపోయినట్లైంది. అయితే ఆదాయం మాత్రం ఈసారి 10.7 శాతం పెరిగి 13,697.6 కోట్ల రూపాయలకు చేరింది. నిరుడు 12,370.6 కోట్ల రూపాయలకే పరిమితమైంది. స్టాక్ మార్కెట్లు ముగిశాక విప్రో సిఇఒ, బోర్డు సభ్యుడు అబిదాలి నీముచ్‌వాలా ఈ ఫలితాలను విడుదల చేయగా, ఐటి విభాగంలో ఈ జూన్ 30 నాటికి ఉద్యోగుల సంఖ్య 1.73 లక్షలుగా ఉంది. ఇక ఐటి ఉత్పత్తుల నుంచి వచ్చిన ఆదాయం 590 కోట్ల రూపాయలుగా నమోదైంది. కాగా, ఈ జూ లై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ ఐటి సేవల అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉంటాయని విప్రో అంచనా వేసింది. అయితే వచ్చే త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్ నుంచి పరిస్థితులు మెరుగ్గా ఉండొచ్చని ఆశాభావం సంస్థ వెలిబుచ్చింది. కాగా, 2020 నాటికి 15 బిలియన్ డాలర్ల టర్నోవ ర్‌ను సాధిస్తామన్న విశ్వాసాన్ని సంస్థ చీఫ్ నీముచ్‌వాలా వ్యక్తం చేశారు.

మంగళవారం బెంగళూరులో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్న
విప్రో సిఇఒ నీముచ్‌వాలా