బిజినెస్

హైదరాబాద్‌లో వంద ‘మన కూరగాయలు’ ఔట్‌లెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన కూరగాయాలు’ పథకం విజయవంతం కావడంతో త్వరలోనే హైదరాబాద్‌లో 100 ఔట్‌లెట్‌లను ప్రారంభించబోతున్నట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి, మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు మంత్రి వివరించారు. మార్కెటింగ్ శాఖపై మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో గిడ్డంగుల సంస్థను బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగుల్లో జవాబుదారీ కోసం త్వరలో ‘జాబ్ చార్ట్’ ప్రవేశపడుతున్నామన్నారు. సమర్థవంతంగా పని చేయని, లక్ష్యాలు సాధించని ఉద్యోగులకు జరిమానా విధించనున్నట్టు మంత్రి తెలిపారు.
ఇక నుంచి మొదట ప్రభుత్వ గోదాములు నిండిన తర్వాతనే ప్రైవేట్ గోదాములకు వెళ్లాలని మంత్రి సూచించారు. అయితే ప్రస్తుతం అలా కాకుండా ప్రైవేట్ గోదాములు నిండిపోగా, ప్రభుత్వ గోదాములు వెలవెలబోయే పరిస్థితి నెలకొందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో రూ. 1,024 కోట్లతో నిర్మిస్తున్న 330 గోదాముల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. దసర పండుగ నాటికి కొత్తగా నిర్మించే గోదాములన్ని పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలన్నింటికీ త్వరలోనే పాలకవర్గాల నియామకాలను పూర్తి చేస్తామన్నారు.

శుక్రవారం హిమాయత్‌నగర్‌లో ‘మన కూరగాయలు’
ఔట్‌లెట్‌ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు