బిజినెస్

ఐదు గ్రిడ్లతో వనరుల వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో అపారంగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రిడ్ల వ్యవస్థ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. రాష్ట్రంలో అంతులేని జలరాశి పారుతోంది. 974 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. భూగర్భంలో అమూల్యమైన ఖనిజ సంపద ఉంది. ఈ వనరులన్నింటినీ ఒక ప్రణాళిక ప్రకారం సమర్థవంతంగా వినియోగించుకుంటే నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చవచ్చు. ఈ వనరులను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమంగా పంపిణీ చేసి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గ్రిడ్ల వ్యవస్థను ప్రారంభించింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సమకూర్చే ప్రాథమిక సౌకర్యాలు, వౌలిక సదుపాయాలు అన్ని ప్రాంతాల ప్రజలకు సమానంగా అందుతాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఈ ప్రయోజనాలు దక్కే విధంగా వాటి కార్యాచరణను రూపొందించారు. గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్, పైబర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, పవర్ గ్రిడ్ అని మొత్తం అయిదు గ్రిడ్లను ఏర్పాటు చేసింది.
గ్యాస్ గ్రిడ్: కేజి బేసిన్‌లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయి. అయిదేళ్లలో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. విశాఖపట్నం జిల్లా గంగవరం వద్ద ఎల్‌పిజి టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టు వద్ద ఫ్లోటింగ్ స్టోరేజ్ రీ-గ్యాసిఫికేషన్ యూనిట్‌ను శరవేగంగా నిర్మిస్తున్నారు. కాకినాడ నుంచి విశాఖ వరకు గ్యాస్ పైప్‌లైన్, ఫ్లోటింగ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి.
వాటర్ గ్రిడ్: రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఈ గ్రిడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రిడ్ ద్వారా అన్ని గ్రామాలకు 365 రోజులు మంచినీటి సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2019 నాటికి రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో కూడా మంచినీటి సమస్య లేకుండా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఫైబర్ గ్రిడ్: ఇంటర్నెట్ మొబైల్ విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఈ రోజు బ్రాడ్‌బ్రాండ్ లేని గ్రామం లేదు. అత్యధికులు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ ఒక మానవ హక్కుగా మారిన తరుణంలో బ్రాడ్ బ్రాండ్ విప్లవం ద్వారా అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వం ఆశయం. రూ. 147కే ఇంటర్నెట్ సేవలు ప్రజల ముంగిటికి చేర్చాలని ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసింది.
రోడ్ గ్రిడ్: రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుంచి 9 జిల్లాలలోని సముద్ర తీరం నుంచి జాతీయ రహదారులను కలిపే విధంగా రోడ్లను నిర్మించడానికి ఈ రోడ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి బిటి రోడ్డు, గ్రామాల నుంచి మండల కేంద్రానికి సింగిల్ లైన్ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసుల రోడ్లు, జాతీయ మార్గాల అవసరాలను బట్టి నాలుగు, ఆరు వరుసల రోడ్లు నిర్మిస్తారు. జిల్లా కేంద్రాల నుంచి ప్రధాన నగరాలకు ఆరు వరుసల రోడ్లు నిర్మిస్తారు. ప్రధాన నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లును ఏర్పాటు చేస్తారు.
పవర్ గ్రిడ్: రాష్ట్ర ప్రగతికి చోదకంగా నిలిచే విద్యుచ్ఛక్తి రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా గుర్తించింది. అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా సవ్యంగా జరిగేందుకు ఈ గ్రిడ్‌ను ఏర్పాటు చేసింది. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అద్వితీయమైన విజయాలు సాధించింది. ఈ ప్రభుత్వం 2014లో బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేది. రెండేళ్లలో మిగులు రాష్ట్రంలో నిలిచింది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, పొదుపు, సంరక్షణ విధానాలలో రాష్ట్రం వరుసగా అవార్డులు అందుకున్నది తెలిసిందే.