బిజినెస్

రైలు ప్రయాణికుల కోసం ‘జనాహార్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 27: రైలు ప్రయాణికులకు పసందైన, అందుబాటు ధరలో ఉండేలా భోజన, అల్పాహారం సదుపాయం కల్పించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) ఆధ్వర్యంలో దీనిని నిర్వహించనుంది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధమైంది. భారతీయ రైల్వే పరిధిలో 17 రైల్వే జోన్లు ఉన్నాయి. కనీసం మూడు డివిజన్లతో కూడిన రైల్వేజోన్ పరిధిలో ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మకంగా జనాహార్‌ను నిర్వహించాలని గత కొంతకాలం కిందటే నిర్ణయించిన రైల్వే.. ఇప్పుడు దీనిని కార్యరూపం దాల్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇందులోభాగంగా భారతీయ రైల్వేలోనే పెద్ద రైల్వేజోన్‌గా ఉన్న ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ పరిధిలో తొలుత వాల్తేరు డివిజన్‌కు సంబంధించి విశాఖ రైల్వే స్టేషన్‌లో దీనిని నిర్వహించేందుకు చర్యలు మొదలయ్యాయి. అదీ భారతీయ సంస్కృతి, సాంప్రాదాయాలకనుగుణంగా శ్రావణమాసంలో విశాఖ రైల్వేస్టేషన్ ఒకటవ నెంబర్ ఫ్లాట్‌ఫారం వద్ద జనాహార్‌ను ఏర్పాటు చేసేందుకు ఐఆర్‌సిటిసికి చెందిన అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకించి దాదాపు నాలుగు కోట్ల నిధులు వెచ్చించనున్నారు. రకరకాలైన అల్పాహారం, భోజన సదుపాయం ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. విశాఖ రైల్వేస్టేషన్ ఏపీలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. అలాగే దేశం నలుమూలల నుంచి వచ్చే రైళ్ళ ద్వారా నగరానికి వచ్చే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాన్య ప్రయాణికులతోపాటుగా ప్రతిరోజు 50 వేల మందికి పైగానే ఉంటారు. సూపర్‌ఫాస్ట్‌లు, వీక్లీ స్పెషల్ రైళ్ళు, రోజూ నడిచే ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ళు 120కి మించి ఉన్నాయి. అందువల్ల జనాహార్‌ను నిర్వహించడం ద్వారా వీరందరికీ పసందైన భోజనాన్ని అందివ్వాలనే లక్ష్యంతో ఐఆర్‌సిటిసి దీనిని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధానంగా అందరికీ అందుబాటులోకి ఉండేలా కారుచౌకగా భోజనాన్ని అందివ్వాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఖరీదైన భోజనం పేరుతో నాణ్యత కొరవడిన ఆహార పదార్థాలనే ప్రయాణికులు పొందాల్సి వస్తోంది. దీనివల్ల సొమ్మూ పోతోంది.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కాస్తంత తక్కువ ధరకు లభించే ఆహార పదార్థాలు అందుబాటులోకి రావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బేస్ కిచెన్ల తొలగింపు
ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో గతంలో బేస్ కిచెన్లు ఉండేవి. సాధారణం కంటే కాస్త ఎక్కువ ధరలకే అల్పాహారం, భోజన సదుపాయాలు ఇక్కడ లభించేవి. బేస్ కిచెన్ల నిర్వాహాకులకు ప్రయాణించే రైలు నుంచే ఫోన్ల ద్వారా ఆర్డర్లు ఇస్తే సంబంధిత స్టేషన్‌కు చేరుకునేసరికి భోజన సదుపాయం అందుబాటులోకి వచ్చేది. అలాగే ఆగి ఉన్న పలు రైళ్ళల్లో ప్రయాణికులు భోజనం కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేది. అయితే అనేక విధాలైన సాంకేతికపరమైన సమస్యలతో వీటిని ఎత్తివేశారు.
తగ్గిపోతున్న పాంట్రీలు
ప్రయాణంలో రైళ్ళల్లోనే భోజన వసతి కల్పించే పాంట్రీ కార్ల వ్యవస్థ కూడా క్రమేపీ మరుగున పడుతోంది. దశలవారీగా పాంట్రీ కార్లను తగ్గిస్తూ భవిష్యత్‌లో ఇవేమీ లేకుండా చేయాలని రైల్వే నిర్ణయించింది. వీటి స్థానంలో ఎటువంటి సాంకేతిపరమైన సమస్యలు తలెత్తని జనాహార్‌ను ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో నిర్వహించాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ రైల్వేస్టేషన్‌లో త్వరలోనే ఇది ఏర్పాటు కానుందని సంబంధితాధికారి తెలిపారు.