బిజినెస్

15 శాతం రాయితీతో బ్రాండెడ్ వస్తువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో రేషన్ దుకాణాలను మినీ సూపర్ బజార్లుగా మార్చాలన్న ప్రభు త్వం ఆలోచనను రేషన్ షాపుల డీలర్లు స్వాగతించారు. డీలర్ల కమీషన్‌ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల డీలర్ల సమాఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియచేసింది. సమాఖ్య నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం సిఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా, బ్రాండెడ్ వస్తువులను 15 శాతం రాయితీతో ప్రజలకు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సమాఖ్య నాయకులు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. ప్రజలు ఎక్కువగా ఇష్టపడే బ్రాండెడ్ వస్తువులను నేరుగా ఎంఎల్‌ఎస్ పాయింట్‌లకు 30 శాతం తక్కువ ధరకు అందచేస్తారని వారు సిఎంకు వివరించారు. ఇందులో ఐదు శాతం రవాణా చార్జీలు పోగా, 10 శాతం డీలర్లకు మార్జిన్ ఇవ్వాలని వారు చెప్పారు. 15 శాతం రాయితీతో వస్తువులను ప్రజలకు విక్రయిస్తామని వారు చెప్పారు. దీనివలన ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని, 75 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తారని డీలర్ల సమాఖ్య ప్రతినిధులు సిఎంకు వివరించారు. అయతే నలుగురు కుటుంబ సభ్యులున్న డీలర్ల కుటుంబాలు జీవించడానికి గ్రామీణ ప్రాంతాల్లో 15 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 20 వేల రూపాయలు ఖర్చవుతుందని, ఈ ఆదాయం వచ్చేందుకు ప్రభుత్వం తమకు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని తమకు గౌరవ వేతనంగా ఇస్తే, కేవలం రేషన్ సరుకుల పంపిణీయే కాకుండా, ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు అందించడం కోసం పనిచేస్తామని వారు ప్రతిపాదించారు. ఈపోస్ విధానం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 6,500 పెన్షన్‌లలో 5,500 పెన్షన్లను ఒకే రోజు అందచేసిన విషయాన్ని డీలర్లు సిఎంకు గుర్తు చేశారు. రేషన్ దుకాణాలను మీ సేవా కేంద్రాలుగా మార్చి, బిల్లుల చెల్లింపునకు ఇచ్చే కమీషన్‌ను తమకే ఇస్తే, ప్రభుత్వం ఇప్పుడు పడుతున్న అదనపు భారం తగ్గుతుందని వారు చెప్పారు.
అలాగే ఒక్కో డీలర్ దగ్గర నుంచి 50 వేల రూపాయలు ముందుగానే డిపాజిట్ సేకరించడం ద్వార ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని వారు చెప్పారు. రేషన్ షాపుల్లో పరిస్థితిని సమీక్షించి, విజిలెన్స్ దాడులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ప్రతిపాదనలను విన్న చంద్రబాబు వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. చంద్రబాబును కలిసినవారిలో సమాఖ్య నాయకులు బుగతా వెంకటేశ్వరరావు, దివి లీలా మాధవరావు, చిట్టిరాజు, మల్లెల భాస్కరరావు ఉన్నారు.