బిజినెస్

దూసుకెళ్లిన హెచ్‌డిఎఫ్‌సి లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ అతిపెద్ద మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 26.86 శాతం వృద్ధి చెంది 2,796.92 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే త్రైమాసికంలో 2,204.29 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం సంస్థ తెలియజేసింది. ఇక ఆదాయం ఈసారి 13,516.99 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 11,397.29 కోట్ల రూపాయలుగా నమోదైంది. కాగా ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌లో 12.33 శాతం షేర్లను ఎర్గో ఇంటర్నేషనల్ ఎజికి హెచ్‌డిఎఫ్‌సి అమ్మేసింది. ఇది లాభం పెరుగుదలకు దోహదపడిందని సంస్థ వర్గాలు అభిప్రాయపడ్డాయి.