బిజినెస్

జిఎస్‌టిపై ఆశతో లాభాల్లోకి మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 27: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఓ మోస్తరు లాభాలను అందుకున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లులో కొన్ని నిర్ణయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీపడటం మార్కెట్ సెంటిమెంట్‌ను కొంతమేర పెంచింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 47.81 పాయింట్లు పెరిగి 28,024.33 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 25.15 పాయింట్లు అందుకుని 8,615.80 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, సింగపూర్, తైవాన్ సూచీలు లాభపడగా, చైనా, దక్షిణ కొరియా సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు పెరిగాయి.

బజాజ్ ఆటో
లాభం రూ. 1,039.7 కోట్లు
న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ త్రిచక్ర, ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 13.77 శాతం పెరిగి 1,039.7 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 913.86 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బజాజ్ ఆటో బుధవారం తెలిపింది. ఇక మొత్తం ఆదాయం ఈసారి 6,088.75 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 5,881.24 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ఏప్రిల్-జూన్‌లో బజాజ్ ఆటో వాహన విక్రయాలు అంతకుముందుతో చూస్తే 2 శాతం క్షీణించి 10,13,029 యూనిట్ల నుంచి 9,94,733 యూనిట్లకు దిగజారాయి.

జెఎస్‌డబ్ల్యు స్టీల్
లాభం రూ. 1,109 కోట్లు
న్యూఢిల్లీ, జూలై 27: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జెఎస్‌డబ్ల్యు స్టీల్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే ఎన్నో రెట్లు పెరిగింది. ఈసారి 1,109 కోట్ల రూపాయలుగా ఉన్న లాభం.. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 21.19 కోట్ల రూపాయలుగానే ఉంది. ఇక మొత్తం ఏకీకృత ఆదాయం ఈసారి 12,885.81 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 12,647.35 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బుధవారం జెఎస్‌డబ్ల్యు స్టీల్ తెలియజేసింది. కాగా, నిరుడు ఏప్రిల్-జూన్‌లో 3.40 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగితే, ఈ సంవత్సరం 3.87 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగిందని సంస్థ వివరించింది.

భారతీ ఎయిర్‌టెల్
లాభం రూ. 1,462 కోట్లు
న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నిరుడుతో పోల్చితే సుమారు 31 శాతం పతనమై 1,462 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో 2,113 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది. ఏకీకృత ఆదాయం ఈసారి 25,572.9 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 23,680.8 కోట్ల రూపాయలుగా ఉందని బుధవారం ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్ తెలియజేసింది. కాగా, ఈసారి లాభాలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం అధిక మూలధన వ్యయమేనని సంస్థ భారత్, దక్షిణాసియా విభాగాల మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.