బిజినెస్

హోటళ్ల విక్రయ ఆఫర్‌ను తిరస్కరించిన సహారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్/న్యూఢిల్లీ, జూలై 27: తమ విదేశీ హోటళ్ల అమ్మకానికి సంబంధించి వచ్చిన ఆఫర్‌ను సహారా గ్రూప్ తిరస్కరించింది. ‘సహారా-సెబీ’ కేసులో అధినేత సుబ్రతారాయ్ విడుదలకు సుప్రీం కోర్టు సూచించిన పూచీకత్తును సమర్పించడానికి లండన్, న్యూయార్క్ నగరాల్లోని మూడు లగ్జరీ హోటళ్లను సహారా అమ్మకానికి పెట్టినది తెలిసిందే. ఈ క్రమంలోనే జస్‌దేవ్ సగ్గర్ నేతృత్వంలోని బ్రిటన్‌కు చెందిన 3 సంస్థలు, మిడిల్ ఈస్ట్‌కు చెందిన మరికొందరితో కూడిన ఓ మదుపరుల కూటమి 1.3 బిలియన్ డాలర్ల (్భరత కరెన్సీ విలువ ప్రకారం సుమారు 9,000 కోట్ల రూపాయలు)కు ఆ మూడు హోటళ్లను అడిగింది. దీనికి అస్సలు అంగీకరించని సహారా గ్రూప్.. ఈ ఆఫర్‌ను తీవ్రంగా తప్పుబట్టింది. హోటళ్ల అసలు విలువను దెబ్బతీసేలా ఈ ఆఫర్ ఉందని మండిపడింది. అసలు తమ హోటళ్లను కొనగలిగే స్థాయి వీరిది కాదంటూ ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అమ్మకానికి పెట్టిన హోటళ్లలో లండన్‌లోని గ్రాస్‌వెనార్ హౌజ్, న్యూయార్క్‌లోని పార్క్ ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్ ఉన్నాయి.