బిజినెస్

లీఎకో చేతికి విజియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ లీఎకో.. అమెరికాకు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ విజియోను హస్తగతం చేసుకుంది. నిశ్చయాత్మక ఒప్పందంలో భాగంగా 2 బిలియన్ డాలర్ల (ప్రస్తుతం భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 13,500 కోట్లు)కు విజియో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వ్యాపారం, టెక్నాలజీ, మేధో సంపత్తి ఆస్తులను చేజిక్కించుకున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో లీఎకో తెలిపింది. ఈ ఏడాది ఆఖరుకల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని సదరు ప్రకటనలో పేర్కొంది. ఇదిలావుంటే విజియో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వ్యాపారాన్ని లీఎకోనే చూసుకోనుండగా, విజియో డేటా వ్యాపారాన్ని మాత్రం మరో సంస్థ చూసుకోనుంది. కాగా, ‘విజియో కొనుగోలు తమ ప్రపంచీకరణ వ్యూహంలో కీలకం. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో తమ వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ఇది ఎంతగానో దోహదపడగలదు.’ అని లీఎకో వ్యవస్థాకుడు, చైర్మన్, సిఇఒ యుఎటింగ్ జియా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక విజియోను 2002లో స్థాపించారు. ఉత్తర అమెరికాలో ఇది ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్. స్మార్ట్ టెలివిజన్లు, సౌండ్ బార్స్ తదితర విభాగాల్లో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను అందుకుంటోంది. ఇప్పటిదాకా 7 కోట్లకుపైగా ఉత్పత్తులను అమ్మింది. ‘14 ఏళ్ల క్రితం విజియోను ప్రారంభించడానికి నేను నా ఇంటిని తాకట్టు పెట్టాను. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఉత్తర అమెరికాలో అత్యంత ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థల్లో ఒకటిగా విజియో స్థిరపడింది. నేను స్థాపించిన సంస్థ ఈ స్థాయిలో ఉందంటే ఓ వ్యాపార, పారిశ్రామికవేత్తగా ఇంతకంటే నాకు గౌరవం మరొకటి లేదు.’ అని విజియో వ్యవస్థాపకుడు, చైర్మన్, సిఇఒ విలియం వాంగ్ అన్నారు. ఇక విజియోలో ఇప్పుడున్న ఎగ్జిక్యూటివ్ మేనెజ్‌మెంట్ ఇకపైనా ఉంటుంది. ఇర్విన్‌లోని ప్రస్తుత ప్రధాన కార్యాలయం నుంచే వ్యాపార కార్యకలాపాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయి. అలాగే ఇప్పుడున్న డిస్ట్రిబ్యూటర్లు, ఆ పంపిణీ విధానంలోనే విజియో బ్రాండ్ ఉత్పత్తుల అమ్మకాలు జరగనున్నాయి.