బిజినెస్

చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: తెలంగాణ రాష్ట్రంలో చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేంద్రానికి రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ వాసుల సమస్యలను కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఆయన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, పౌర విమానయాన శాఖ మంత్రి ఆశోక్ గజపతి రాజులతో సమావేశం అయ్యారు. కేంద్రం ప్రవేశపెడుతున్న నూతన పౌర విమానయాన పాలసీపై ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రాంతీయ వైమానిక అనుసంధానాన్ని పెంచే ముసాయిదాపై అన్ని రాష్ట్రాల, సంబంధిత సంస్థలు పాల్గొని తమ అభిప్రాయాలు సూచనలు తెలిపాయి. అనంతరం కెటిఆర్ విలేఖరులతోమాట్లాడుతూ విమానయాన రంగంలో నూతన పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర విమానయాన రంగంలో వౌలిక వసతుల అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ విమానాశ్రయాలను వాడుకలోకి తీసుకురావాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు కెటిఆర్ తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్, బసంత్‌పూర్,నాగార్జున సాగర్, నల్గొండలోని విమానాశ్రయాలను వాడుకలోకి తీసుకురావాలని కేంద్రన్ని కోరినట్లు చెప్పారు.ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు వల్ల రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్ నుంచి అమెరికాలోని డల్లాస్,న్యూయార్క్ నగరాలకు నేరుగా విమాన సేవలు ప్రారంభించేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు మంత్రి చెప్పారు. గల్ఫ్‌దేశాల్లో తెలంగాణ వాసుల సమస్యలను కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గల్ఫ్ దౌత్యకార్యాలయంలో తెలుగు తెలిసిన అధికారిని నియమించాలని కోరామన్నారు. వివిధ కారణాల చేత గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయం సహాయం అందిచేలా చర్యలు తీసుకోవాలని కోరమన్నారు. ఇతర దేశాలకు వెళ్లిన, వెళ్లాలనుకునే వారి సమగ్ర సమాచారాన్ని నివేదికగా రూపొందించడానికి కేంద్ర సహకారాన్ని కోరామని ఆయన తెలిపారు. లిబియాలో ఉగ్రవాదుల చేత అపహరణకు గురైన బలరాం కిషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు.