బిజినెస్

సంస్కరణలతోనే వృద్ధి ద్రవ్య, ఆర్థిక విధానాల మద్దతు అవసరం: ఎస్‌అండ్‌పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ద్రవ్య, ఆర్థిక విధానాల మద్దతుతో భారత వృద్ధిరేటు 8 శాతాన్ని అందుకోగలదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పి అభిప్రాయపడింది. రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశ జిడిపి వృద్ధి 8 శాతాన్ని చేరగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అయితే సంస్కరణల అమలు మందగిస్తే మాత్రం వృద్ధి పతనం కాకతప్పదని హెచ్చరించింది. ‘ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిరేటును కలిగిన దేశంగా చైనాకు భారత్ అతి సమీపంలో ఉంది. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులనూ అధిగమిస్తూ మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే భారత్ దూసుకెళ్తోంది. అయితే సంస్కరణలు నెమ్మదిస్తే మాత్రం ఇదంతా ఇక్కడికే పరిమితమవుతుంది.’ అని అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పి ఓ ప్రకటనలో బుధవారం తెలిపింది. ఇకపోతే రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్ధిరేటు దాదాపు 8 శాతానికి చేరగలదన్న ఎస్‌అండ్‌పి గ్లోబల్ రేటింగ్స్.. ఇదే సమయంలో చైనా వార్షిక వృద్ధిరేటు 7 శాతం దిగువకు చేరవచ్చని అంచనా వేసింది.